twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం తాగించి.. ఫొటోలు తీశాడు.. లైంగిక దాడి కేసులో నటుడికి..!

    |

    బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలికి ఊరట లభించింది. హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ నటి తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదిత్య పంచోలికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 3 తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

    నాపై లైంగిక దాడి చేశారంటూ

    నాపై లైంగిక దాడి చేశారంటూ

    నటుడు ఆదిత్య పంచోలి 2004, 2006 సంవత్సరాల్లో తనపై లైంగిక దాడి జరిపారు. తన మద్యం తాగించి శారీరకంగా అనుభవించేందుకు ప్రయత్నించాడు. పలు సమయాల్లో తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడుతానని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు అని బాధిత నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     హెచ్చరించినా.. ప్రవర్తన మార్చుకోలేదని

    హెచ్చరించినా.. ప్రవర్తన మార్చుకోలేదని

    గతంలో కూడా తాను ఆదిత్య పంచోలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ అతడిని హెచ్చరించి వదిలేశారు. కానీ తన ప్రవర్తనను మార్చుకోలేదు. తనపై వేధింపులను కొనసాగించాడు. తనకు ప్రాణాపాయం ఉన్నందున్న మళ్లీ ఫిర్యాదు చేయడానికి బయపడ్డాను. కానీ అతడిపై బెదిరింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఫిర్యాదు చేశాను అని బాధితురాలు వెల్లడించారు.

     ఆదిత్య పంచోలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

    ఆదిత్య పంచోలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు

    బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆదిత్య పంచోలిపై జూన్ 28న వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 328 (బలవంతంగా మద్యం సేవింపజేసిన కుట్ర) 384 (డబ్బు లాగే ప్రయత్నం), 341 (మోసం, 342, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంతో ఈ కేసులో ఆదిత్య పంచోలి కూరుకుపోయాడు.

    తప్పు చేయలేదు: ఆధారాలున్నాయంటూ

    తప్పు చేయలేదు: ఆధారాలున్నాయంటూ

    తనపై వచ్చిన ఆరోపణలపై, కేసుపై ఆదిత్య పంచోలి స్పందించాడు. నాపై తప్పుడు కేసు నమోదైంది. నేను తప్పేమీ చేయలేదని చెప్పడానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతే నన్ను పోలీసులు సంప్రదించారు. అయినా నేను పోలీసులకు, విచారణకు సంప్రదిస్తాను అని ఆదిత్య పంచోలి వెల్లడించారు. ఈ క్రమంలో వెర్సోవా పోలీసులు ఆదిత్య పంచోలి నుంచి మే 12న స్టేట్‌మెంట్ తీసుకొన్నారు.

    English summary
    Aditya Pancholi gets interim protection till August 3 from Mumbai court in rape case. The Dindoshi sessions court in Mumbai has granted interim protection to actor Aditya Pancholi till August 3, in a rape case filed against him by a top Bollywood actress, reports ANI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X