twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాక్‌లో పుట్టి భారత్‌కు జై కొడతావా.. బాలీవుడ్ సింగర్‌పై విరుచుకుపడ్డ నెటిజన్లు!

    |

    పుల్వామా ఘటనకు సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్ తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. నేరుగా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ యుద్ధ విమానాలు జైషే మహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్ ని నేలమట్టం చేసి వచ్చాయి. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదుమట్టిలో కలసిపోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు సెలెబ్రిటీలు వారికి తోచిన విధంగా ఈ పరిస్థితులపై స్పందిస్తున్నారు.

    సర్జికల్ స్ట్రైక్ గురించి

    సర్జికల్ స్ట్రైక్ గురించి

    ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ పాక్ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. కొన్నేళ్ల క్రితం సమీకి భారత పౌరసత్వం కూడా లభించింది. ఆ సందర్భంగా సమీ తన సతీమణి, కుమార్తెతో కలసి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. బాలకోట్ పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇటీవల బాంబుల వర్షం కురిపించి జైషే మహమ్మద్ ఉగ్రవాదులని మట్టుబెట్టింది. ఈ సందర్భంగా సమీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని, ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

     కట్టలు తెంచుకున్న ఆగ్రహం

    కట్టలు తెంచుకున్న ఆగ్రహం

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పట్ల గర్వంగా ఉంది. హౌ ఈజ్ ది జోష్.. ఉగ్రవాదాన్ని నిర్ములించాలి అని అద్నాన్ సమీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అద్నాన్ సమీ ఇండియాకు మద్దత్తుగా ట్వీట్ చేయగానే పాక్ నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనితో అద్నాన్ సమీపై ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. పాక్ లో పుట్టి ఇండియాకు జై కొడతావా సిగ్గులేదా అంటూ, ఇంకా దారుణమైన పరుష పదజాలంతో సమీని ట్రోల్ చేశారు.

    మ్యాటర్ అదికాదు

    తనపై వస్తున్న ట్రోలింగ్ కు అద్నాన్ సమీ అదే స్థాయిలో స్పందించి ధీటైన సమాధానం ఇచ్చాడు. ఇక్కడ అసలు విషయం మీ ఇగోలకు సంబంధించినది కాదు. వాస్తవంలోకి వచ్చి అసలు విషయం గమనించండి. మీరు కూడా శత్రువులుగా భావిస్తున్న ఉగ్రవాదులని లేకుండా చేయడం ముఖ్యం. ఈ విషయాన్ని గ్రహించకుండా నాపై మీరు కామెంట్స్ చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. నిజాల్ని ఒప్పుకోకుండా ఇలా దిగజారి మాట్లాడడం మీ మనస్తత్వాలకు నిదర్శనం అని అద్నాన్ సమీ ట్వీట్ చేశాడు.

    మన హీరో కోసం

    మన హీరో కోసం

    ఇదిలా ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మన హీరో అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని సెలెబ్రిటీలంతా సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షిస్తున్నారు. అభినందన్ ధైర్యానికి ప్రతి ఒక్కరూ ప్రసశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా బాలీవుడ్ లో పాక్ నటుల్ని బ్యాన్ చేశారు. పాకిస్థాన్ కూడా తమ దేశంలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శన లేకుండా బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

    English summary
    Adnan Sami burns Pakistani trolls slamming him for praising IAF: Your abuses expose your reality
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X