అల్లు అర్జున్ తర్వాత 10 కోట్ల రెమ్యునరేషన్ సీనియర్ హీరో రిజెక్ట్.. ఎందుకో తెలుసా?
సినీ పరిశ్రమలో కొంచెం ఫేమ్ ఉన్నా చాలు వారికి కాసుల వర్షం వద్దాన్నా వస్తుంది. అయితే సినిమాల పరంగానే కాకుండా నటీనటులకు బయట నుంచి అంటే పలు యాడ్స్ చేసినా కూడా డబ్బులు బాగానే ముట్టుతాయి. అయితే వారి ఫేమ్ తో ఆ స్టార్స్ ఎలా డీల్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యమైన పాయింట్ గా నిలుస్తుంది. మరి యాడ్స్ అన్నాక అనేక బ్రాండ్స్ ఉంటాయి.
మరి తమ ఫేమ్ తో అభిమానులకి ఎలా మార్గదర్శకం అవుతారు అనేది కూడా ముఖ్యం అందుకే కొంతమంది స్టార్స్ తమ ఫేమ్ ని ఎందుకు పడితే అందుకు వాడరు. వారికంటూ కొన్ని విలువలు పెట్టుకొని అలా డీల్ చేస్తారు. మరి ఇలానే బాలీవుడ్ లో ఓ ప్రముఖ సీనియర్ నటుడు అయితే ఏకంగా 10 కోట్ల డీల్ ని వదిలేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఆ నటుడు ఎవరో కూడా ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చిన నటుడు అనీల్ కపూర్ అట. మరి హిందీలో అనీల్ కపూర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడుకి కూడా ఎంతో ఫిట్ గా ఎనర్జిటిక్ గా తాను కనిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ అనిమల్ సినిమాలో కనిపించిన తాను లేటెస్ట్ గా 10 కోట్ల డీల్ కి నో చెప్పారట.
మాములుగా ఇంత మొత్తంలో డీల్ కి అది కూడా అనీల్ కపూర్ లాంటి సీనియర్ నటుడు బాలీవుడ్ లో హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే చేస్తున్న ఓ నటుడికి కెరీర్ పరంగా భారీ మొత్తమే అయినా కూడా తాను ఆ డీల్ వదులుకున్నారట. కాగా దీనికి ప్రధాన కారణం తనకి అంత మొత్తంలో డీల్ ఇచ్చింది ఒక పాన్ మసాలా కంపెనీ నుంచి అట.
బాలీవుడ్ లో వీటికి చాలా మంది స్టార్స్ ఆల్రెడీ యాడ్స్ చేస్తున్నారు కానీ తన దగ్గరకి వచ్చిన ఆఫర్ ని మాత్రం అనీల్ కపూర్ రిజెక్ట్ చేశారట. ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరం అని ఇలాంటి వాటికి నేను నా ముఖాన్ని బ్రాండ్ అంబాసిడర్ గా ఇవ్వను అని వారు ఇస్తామన్న భారీ మొత్తానికి నో చెప్పేశారట. దీనితో ఈ టాక్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.

కాగా మన తెలుగు నుంచి ఓ బిగ్ స్టార్ కి తక్కువ సమయం వారికి డేట్స్ కేటాయించినా భారీ మొత్తంలోనే ఇస్తామని ఓ పాన్ మసాలా కంపెనీ ఆఫర్ చేయగా ఆ హీరో కూడా నో చెప్పాడని పలు వార్తలు ఆ మధ్య వినిపించాయి. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నే..
అల్లు అర్జున్ కి పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ వచ్చింది. దీనితో తనకి ఆ మధ్య భారీ ఆఫర్ వచ్చింది అంట కానీ తాను కూడా ఇలాంటి వాటికి అయితే ఎంత ఇచ్చినా చెయ్యను అని చెప్పి వెనక్కి పంపినట్టుగా టాక్ వచ్చింది. మళ్ళీ ఇపుడు అనీల్ కపూర్ ఇదే బాటలో వెళ్లారని చెప్పాలి.


Click it and Unblock the Notifications











