twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజయ్ దేవగన్ అలా, సల్మాన్ ఖాన్ ఇలా.. బెదిరింపులు రాగానే అలర్ట్!

    |

    ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. పాక్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో జరిగిపిన ఆత్మాహుతి దాడిలో 49మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో చెలరేగిన నిరసన జ్వాలలు ఇంకా దేశం నలుమూలల కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి ప్రభావం సినీ, రాజకీయ, క్రీడా రంగాలపై పడుతోంది. ముఖ్యంగా పాక్ కళాకారుల ప్రమేయం బాలీవుడ్ చిత్రాలలో ఉండకూడదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ తమ తదుపరి చిత్రాల విషయంలో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.

    బెదిరింపులు

    బెదిరింపులు

    సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. ఈ చిత్రంలో పాకిస్థాన్ సింగర్ అతిఫ్ అస్లామ్ పాట పాడాడు. పాకిస్థాన్ సింగర్స్, నటీనటుల్ని తొలగించకుంటే విడుదలని అడ్డుకుంటాం అని ఇప్పటికే వివిధ సంఘాలు నేతలు ప్రకటించారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగుతున్నారు. పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్ పై సర్వత్రా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పాక్ పై అని వైపులా నుంచి వత్తిడి పెంచే చర్యలు ప్రారంభమయ్యాయి. సినీ నటుల్ని బ్యాన్ చేయడం కూడా అందులో భాగమే అని అంటున్నారు.

    సింగర్ తొలగింపు

    సింగర్ తొలగింపు

    దీనితో కండల వీరుడు సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించి భారత్ చిత్రానికి గాయకుడిగా పనిచేస్తున్న అతీఫ్ అస్లామ్ ని తొలగించినట్లు తెలుస్తోంది. తన నిర్మాణంలో రాబోతున్న నోట్ బుక్ చిత్రానికి కూడా సల్మాన్ పాక్ సింగర్స్ ని తొలగించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న భావోద్వేగాల్ని గౌరవించాలని సల్మాన్ భావిస్తున్నాడట.

    అజయ్ దేవగన్ కీలక నిర్ణయం

    అజయ్ దేవగన్ కీలక నిర్ణయం

    అజయ్ దేవగన్ కూడా తన చిత్రం టోటల్ ఢమాల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పాక్ లో విడుదల చేయడం లేదంటూ ప్రకటించాడు. అదే విధంగా చిత్ర యూనిట్ మొత్తం మరణించిన జవానులు కుటుంబాలకు 50 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా టోటల్ ఢమాల్ చిత్రాన్ని పాక్ లో విడుదల చేయకూడదని తమ చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది అని అజయ్ దేవగన్ ప్రకటించాడు.

    సెట్ నాశనం చేస్తాం

    సెట్ నాశనం చేస్తాం

    ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ పాక్ కు చెందిన నటులు, టెక్నీషియన్లని బాలీవుడ్ చిత్రాల్లో తీసుకుంటే లొకేషన్ కు వచ్చి మరీ సెట్ నాశనం చేస్తాం అని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇదే తరహా హెచ్చరికలని బాలీవుడ్ కు జారీ చేసింది.

    English summary
    After blanket ban on Pakistani artistes, Salman Khan to get Atif Aslam replaced
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X