రణ్‌బీర్ కపూర్ తండ్రికి క్యాన్సర్.. అమెరికాలో ఆయన పరిస్థితి ఏమిటంటే!
గత కొద్దికాలంగా బాలీవుడ్ ప్రముఖులును క్యాన్సర్ వ్యాధి పట్టి పీడిస్తున్నది. సొనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు క్యాన్సర్ వ్యాధికి గురికావడం సినీ, ప్రేక్షకలోకాన్ని ఆందోళనకు గురిచేసింది. వారిద్దరూ విదేశాల్లో చికిత్స పొందుతుండగానే, మరో క్యాన్సర్ వార్త అభిమానులపై పిడుగులా పడింది. రణ్‌బీర్ కపూర్ తండ్రి, అలనాటి రొమాంటిక్ హీరో రిషీ కపూరిని ఈ ప్రాణాంతక వ్యాధి పట్టిపీడిస్తున్నదనే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రిషీకపూర్ సతీమణి, అలనాటి హీరోయిన్ నీతూ కపూర్ తన భర్తకు క్యాన్సర్ వ్యాధికి గురైనట్టు వెల్లఢించారు. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్న రిషీకపూర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇవే..

క్యాన్సర్ అనేది సమస్యే కాదు
గతేడాది చివర్లో రిషీకపూర్‌కు క్యాన్సర్ అని చెప్పడానికి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హ్యాపీ 2019 న్యూఇయర్. రాబోయే సంవత్సరానికి ప్రత్యేకంగా కొత్త ఏడాది తీర్మానాలు లేవు. కాకపోతే భవిష్యత్‌లో క్యాన్సర్ అనేది కేవలం జాతక చిహ్నంగానే మిగిలిపోవాలని కోరుకొంటున్నాను. డబ్బు ఉందా లేదా అనే సమస్యే కాదు. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండటమే సంపన్నవంతులమని చెప్పవచ్చు అని ట్వీట్ చేశారు.

తిరిగి వస్తాను: రిషీ కపూర్ ట్వీట్
క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లూ రిషీ కపూర్ తన గురించి పూర్తిగా వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం అమెరికాకు వెళ్లున్నాను. కొన్ని రోజులు నటనకు దూరంగా ఉంటాను. అందుచేత అభిమానులు ఆందోళన పడుకూడదు. నా ఆరోగ్యం గురించి అతిగా ఊహించుకోవద్దు. 45 ఏళ్లపాటు నా కష్టసుఖాల్లో పాలుపంచుకొన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను అని రిషీకపూర్ ట్వీట్ చేశారు.

బంధువులు, స్నేహితులతో ఫొటో
క్యాన్సర్ వ్యాధి కోసం చికిత్స పొందుతున్న రిషీకపూర్ గురించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చికిత్స పొందుతున్న రిషీతో బంధువులు, స్నేహితులు కలిసి ఉన్న ఫొటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారు. అందరూ నవ్వుతూ ఉన్న ఫొటో పెట్టడం వల్ల రిషీకపూర్ ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టమైంది

త్వరలో రిషీ స్వదేశానికి
క్యాన్సర్ ట్రిట్‌మెంట్ పూర్తవుతున్న కారణంగా రిషీ కపూర్ దంపతులు త్వరలోనే స్వదేశానికి తిరిగిరానున్నరనేది సమాచారం. రిషీ కపూర్ ఆరోగ్యంతో ఉన్నారు. ఇక అమెరికా నుంచి స్వదేశానికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇది మాకు శుభవార్తలాంటిదే అని ఇన్స్‌టాగ్రామ్‌లో ట్వీట్ చేశారు.

రిషిని పరామర్శించిన షారుక్ తదితరులు
ఇక అమెరికాలో రిషీకపూర్‌కు చికిత్స జరుగుతున్న సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. రిషీని పరామర్శించిన వారిలో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, సొనాలి బింద్రే తదితరులు ఆయన పరామర్శించారు. అలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంట న్యూయర్ సందర్బంగా రిషీ కపూర్‌తో కలిసి వేడుకలు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











