జాక్వెలిన్, 'నోరా'లే కాదు.. సుఖేష్ లిస్టులో శ్రద్దా కపూర్, శిల్పా శెట్టి.. సంచలన విషయాలు బయటకు!
200 కోట్ల దోపిడీ కేసులో అరెస్టయి, చాలా కాలంగా వివాదాల్లో ఉన్న మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో కొత్త విషయం వెల్లడయింది. ఇప్పటివరకు, సుఖేష్ కేసులో బాలీవుడ్ బ్యూటీలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు నోరా ఫతేహి ఈడీ రాడార్ కింద ఉన్నారు. అయితే ఇప్పుడు సుఖేష్ తో ఉన్న ఇతర బాలీవుడ్ నటీమణుల పేర్లు కూడా బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రద్ధా కపూర్ సహా శిల్పాశెట్టితో
ఈడీ విచారణలో, సుఖేష్ శ్రద్ధా కపూర్ సహా శిల్పాశెట్టితో సంబంధాలు కలిగి ఉన్నట్లు అంగీకరించాడు. ఈడీ అధికారుల ఎదుట విచారణలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రద్ధా కపూర్ తనకు 2015 నుంచి తెలుసునని సుఖేష్ ఈడీకి తెలిపారు. ఎన్‌సిబి కేసులో శ్రద్ధా కపూర్‌కు కూడా సహాయం చేశానని ఆయన వెల్లడించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్ చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌సీబీ శ్రద్ధా కపూర్‌ను కూడా విచారణకు పిలిచింది. ఈ క్రమంలో ఆమెకు సహాయం చేశానని వెల్లడించారు.

శిల్పాశెట్టిని కూడా
అయితే అసలు విషయం ఏంటంటే శిల్పాశెట్టిని కూడా సుఖేష్ మోసం చేయడానికి ప్రయత్నించాడు. వాస్తవానికి, జూలై 2021లో, రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు పోర్న్ కేసులో అరెస్టు చేసినప్పుడు, సుఖేష్ సహాయం పొందాలని చెబుతూ శిల్పాశెట్టికి కాల్ చేశాడు. ఆ ఫోన్‌లో కూడా, శిల్పాకు నేను ప్రభుత్వ అధికారిని కావడంతో సహాయం చేస్తానని సుఖేష్ హామీ ఇచ్చాడు. అయితే పార్టీ ఫండ్ కింద డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడట. అయితే శిల్పాశెట్టి మాత్రం సుఖేష్ మాటలకి పడలేదని, డబ్బులు ఇవ్వలేదని తేలింది.

హర్మన్ బవేజా
నటుడు హర్మన్ బవేజా తనకు తెలుసునని సుఖేష్ పేర్కొన్నాడు. సుఖేష్ చెబుతున్న దాని ప్రకారం, హర్మన్ బవేజా అతని పాత స్నేహితుడు. సుఖేష్ హర్మాన్ తదుపరి చిత్రం కెప్టెన్‌కి సహనిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కెప్టెన్. ఇది మాత్రమే కాదు, రాజ్ కుంద్రా చట్టపరమైన కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని సంప్రదించినట్లు సుఖేష్ చెప్పాడు. ఈ ఏడాది రాజ్ కుంద్రా అశ్లీలత కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే.

శిల్పా శెట్టితో
విచారణ సమయంలో, ఈడీ శిల్పా శెట్టితో ఉన్న అనుబంధం గురించి అడిగినప్పుడు, సుఖేష్ చంద్రశేఖర్ స్పందిస్తూ - శిల్పా నా స్నేహితురాలు. రాజ్‌కుంద్రా జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి గురించి నేను శిల్పాను సంప్రదించానని కూడా వెల్లడించారు. సుఖేష్ ఈ కామెంట్స్ చేయడంతో శ్రద్ధా కపూర్, హర్మన్ బవేజా, శిల్పాశెట్టి ఈడీ రాడార్ కిందకు వచ్చారు. ఇవి కాక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం పై ఇద్దరు ముఖ్య మంత్రులతో కూడా సమావేశమై మాట్లాడినట్లు సుఖేష్ పేర్కొన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం, సుఖేష్ యొక్క ఈ వాదనలన్నీ అవాస్తవమని మరియు అందులో నిజం లేదని తేలింది.
Recommended Video

ఈడీ రాడార్ లో
సుఖేష్ కేసుకు సంబంధించి జాక్వెలిన్, నోరా ఇప్పటికే ఈడీ రాడార్ లో చిక్కుకున్నారు. నోరా, జాక్వెలిన్‌లు సుకేష్ నుండి ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జాక్వెలిన్‌తో కలిసి సుఖేష్ పర్సనల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జాక్వెలిన్‌తో ఉన్న ఎఫైర్ గురించి సుకేష్ ఓపెన్ అయ్యాడు, కానీ ఇది నిజం కాదని జాక్వెలిన్ పేర్కొంది. వీరి వ్యవహారం పై జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో, సుఖేష్ తనకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడని నోరా కూడా విచారణలో EDకి చెప్పింది.


Click it and Unblock the Notifications











