మొత్తానికి స్టార్ దర్శకుడితో షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్ ఫిక్స్.. రెండేళ్ల తరువాత మేకప్..

బాలీవుడ్ కింగ్ ఖాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చాలా రోజుల తరువాత మేకప్ వేసుకోబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా షారుఖ్ దాదాపు రెండేళ్ల పాటు యాక్టింగ్ కి దూరమయ్యారు. 2018లో వచ్చిన జీరో సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ మరో సినిమా చేయలేదు.

ఇక 2019లో సినిమా ఉండదని ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు 2020లో కూడా షారుక్ నుంచి సినిమా రానట్లే అనే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే కొత్త సినిమాను ఆగస్టులో సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడట. ఆ సినిమా పూర్తవ్వడానికి మినిమమ్ ఏడాది సమయమైనా పడుతుంది. ఎందుకంటే ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని తెరకెక్కిస్తున్నారు. ఆయన సినిమాల కోసం ఎంత టైమ్ తీసుకుంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

After long gap shahrukh khan big budget movie with star director

పీకే, సంజూ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరాని కోసం షారుక్ ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ వర్క్ లో పాల్గోన్నట్లు తెలుస్తోంది. లుక్, ఫిట్నెస్ పై కూడా చర్చలు జరిగాయట. ఇక ఫైనల్ సినిమా స్క్రిప్ట్ కూడా సెట్ కావడంతో ఆగస్ట్ లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఇంతకుముందు తమిళ్ డైరెక్టర్ అట్లీ తో వర్క్ చేయాలని అనుకున్న షారుక్.. సడన్ గా రాజ్ కుమార్ హిరాని సినిమా చేద్దామని చెప్పడంతో అతని ప్రాజెక్టును వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X