అమీర్ ఖాన్ PK సీక్వెల్.. రాజ్ కుమార్ హిరానీ ప్లాన్ మారింది!
ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన రాజ్ కుమార్ హిరాని ఎలాంటి సినిమా చేసినా కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. మున్నాభాయ్ MBBS సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకున్న ఈ దర్శకుడు తన ప్రతి కథలో ఎదో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక రాజ్ కుమార్ తో సినిమా చేయలని అగ్ర సినీ తారలు కూడా ఆశగా ఎదురుచూస్తుంటారు.
రాజ్ కుమార్ హిరాని కెరీర్ లో బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న సినిమాల్లో PK ఒకటి. ఆ సినిమాలో మంచి సందేశాన్ని ఇచ్చిన ఆ దర్శకుడు మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చాలా సందర్భాల్లో స్పందించాడు. కాని ఆ కథ ఎప్పుడు సెట్టయితే అప్పుడే సినిమా ఉంటుందని అన్నారు. ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్న రాజ్ కుమార్ హిరాని ఆ తరువాత రణ్ బీర్ కపూర్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే రణ్ బీర్ తో చేయబోయే సినిమా PK సీక్వెల్ అని టాక్ వస్తోంది. అయితే అది నిజం కాదట. సోషల్ మెస్సేజ్ పాయింట్ టచ్ చేస్తూనే కామెడీ ట్రాక్ తో నడిచే సినిమా అని బాలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. రణ్ బీర్ కూడా ఆ కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇదివరకే వీరి కాంబినేషన్ లో సంజయ్ దత్ బయోపిక్ సంజూ తెరకెక్కిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











