ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగా రాంచరణ్ విలన్.. ప్రపంచానికి తెలియాలి!
ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ ట్రెండ్ సాగుతోంది. సినీ రాజకీయ ప్రముఖలు సంబంధించిన జీవితాలని వెండి తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన బయోపిక్ కు తెరలేచింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథని వెండి తెరపై ఆవిష్కరించడానికి మేరీ కోమ్ డైరెక్టర్ ఒమంగ్ కుమార్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ జీవితం ప్రపంచానికి తెలియాల్సిన కథ అని దర్శకుడు అభిప్రాయ అపడుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

ప్రపంచానికి తెలియాలి
నరేంద్ర మోడీ చాయ్ వాలాగా జీవితాన్ని ప్రారంభించి భారత ప్రధాని స్థాయికి చేరుకున్నారు. వెండి తెరపై ఆవిష్కరించడానికి అవసరమైన అద్భుత అంశాలు నరేంద్రమోడీ జీవితంలో ఉన్నాయి. తప్పకుండా ఇది ప్రపంచం మొత్తం తెలియాల్సిన చరిత్ర ఇది అని ఒమంగ్ కుమార్ అభిప్రాయ పడ్డారు. నరేంద్ర మోడీ ఎన్నో ఒడిదుడుకులని, సవాళ్ళని రాజకీయాల్లో అధికమించారు.

ప్రధానిగా ఎవరంటే
నరేంద్ర మోడీ పాత్రలో నటించబోయేది ఎవరంటే.. ప్రముఖంగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేరు వినిపిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం విలక్షణమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నేళ్ల క్రితం వివేక్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన రక్త చరిత్ర చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రిష్ 3 చిత్రంలో విలన్ గా నటించాడు. ప్రస్తుతం తెలుగులో రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో
ఈ చిత్రాన్ని ఇండియాలోనే అన్ని ప్రాంతాల్లో చిత్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఆయన బాల్యానికి సంబందించిన సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మోడీ వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో బాల్యంలో చాయ్ వాలాగా పనిచేసిన సన్నివేశాల్ని ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ నేతలపై బయోపిక్స్
దేశవ్యాప్తంగా పేరున్న రాజకీయ నేతల జీవితాలకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై తెరకెక్కుతున్న యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ బయోపిక్ తెరక్కుతోంది. మహారాష్ట్ర లీడర్ బాల్ థాకరే జీవితాన్ని థాకరే చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత, కేసీఆర్, వైఎస్ఆర్ బియోపిక్స్ కూడా రూపొందుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











