twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విహార యాత్రలో పట్టుబడ్డ స్టార్ హీరో కొడుకు.. ప్రియురాలితో హాట్ హాట్ రొమాన్స్!

    |

    Recommended Video

    Ahan Shetty Confirms Dating With Tania Shroff

    బాలీవుడ్‌లో సందడి చేస్తున్న కుర్ర తారల్లో ప్రముఖుల పిల్లలు ఆహాన్ శెట్టి, తన్యా ష్రాఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి కాగా, తానియా ప్రముఖ పారిశ్రామికవేత్త జైదేవ్ ష్రాఫ్ కూతురు అనే విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య అఫైర్ సాగుతుందని రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా తానియా ఫ్రాష్‌తో అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చారు. జైదేవ్, తానియా ఇద్దరు విహార యాత్రకు వెళ్లి మీడియాకు చిక్కిపోయారు. వారిద్దరి మధ్య అసలేం జరుగుతున్నదంటే..

    ఐ లవ్ యూ అంటూ

    ఐ లవ్ యూ అంటూ

    బాలీవుడ్ కుర్ర హీరో ఆహాన్ శెట్టి, తానియా ప్రస్తుతం ఇటలీలో విహారయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా తానియ నా జీవితానికి నీవు గొప్ప స్తంభం లాంటి వాడివి అంటూ.. అందుకు బదులుగా ఐ లవ్ యూ అంటూ ఆహాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించాడు. దాంతో వారిమధ్య అఫైర్ గురించి వస్తున్న గాలివార్తలకు తెరదించినట్టు అయింది.

    హాట్ హాట్‌గా ఫోటోలు

    హాట్ హాట్‌గా ఫోటోలు

    ఆహాన్ శెట్టి, తానియా ష్రాఫ్ ఇటలీలో చేస్తున్న రొమాన్స్‌కు వారి ఫొటోలే సాక్ష్యంగా నిలిచాయి. హాట్‌ హాట్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలు ఇంటర్నెట్‌లో కాకపుట్టిస్తున్నాయి. తానియా ష్రాఫ్ షేర్ చేసిన చిత్రాలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇన్స్‌టాగ్రామ్‌లో 10 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

    RX 100 రీమేక్‌లో

    RX 100 రీమేక్‌లో

    ఇక ఆహాన్ శెట్టి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తెలుగులో ఘన విజయం సాధించిన RX 100 సినిమాను రీమేక్‌గా రూపొందిస్తున్న చిత్రం ద్వారా ఆహాన్ హిందీ చిత్ర సీమలో ప్రవేశిస్తున్నాడు. దర్శకుడు మిలన్ లుథ్రియా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్‌గా నటిస్తున్నది.

    ఆహాన్ గురించి

    ఆహాన్ గురించి

    RX 100 రీమేక్ గురించి దర్శకుడు మిలన్ మాట్లాడుతూ.. ఆహాన్‌ బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని బలంగా నమ్ముతున్నాం. విలక్షణమైన ప్రేమ కథా చిత్రం. ఎమోషన్స్, యాక్షన్, డ్రామా లాంటి అంశాలున్న సినిమా. తప్పుకుండా ఆహాన్ ప్రతిభకు మంచి గుర్తింపు నిచ్చే సినిమా అని అన్నారు.

    English summary
    Bollywood Star Suniel Shetty son Ahan Shetty confirms his affair with Tania Shroff. They are holidaying in Italy. Their romantic photos goes viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X