twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుశాంత్ మరణంపై అనుమానాలొద్దు.. హత్య కాదు.. ఆత్మహత్యే‘

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై గత కొద్ది నెలలుగా వస్తున్న ఊహాగానాలకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యుల బృందం తెరదించింది. సుశాంత్‌ది హత్య కాదు.. ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యుల బృందం తరఫున డాక్టర్ సుధీర్ గుప్తా నివేదికను సమర్పించారు.

    అయితే సుశాంత్‌ది 200 శాతం హత్యే అని గతంలో ఎయిమ్స్ వైద్యులు తనకు చెప్పారని వికాస్ సింగ్ ట్వీట్ చేయడం వివాదమైంది. ఆ వివాదం కొనసాగుతుండగానే డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యే అని తేల్చడంతో ఆ వివాదం మరింత జటిలమైంది.

    AIIMS doctor Sudhir Gupta about Sushant Singh Rajput death

    సుశాంత్ మరణంపై ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఇచ్చిన తర్వాత కొన్ని వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దాంతో సుధీర్ గుప్తా వివరణ ఇస్తూ.. సుశాంత్ మరణం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినప్పుడు చాలా అనుమానాలు ఉండేవి. ఆ క్రమంలోనే పోస్టు మార్టమ్ రిపోర్టులను, విసేరా రిపోర్టులను పరిశోధించాం. ఈ కేసులో తెలెత్తిన అనుమానాలకు సమాధానాలు వెతికాం. అందులో భాగంగానే మా అభిప్రాయాన్ని వెల్లడించాం అని సుధీర్ గుప్తా తెలిపారు.

    ఇప్పుడు సుశాంత్ మరణం విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. ఏడుగురితో కూడిన వైద్యుల బృందం తమ అభిప్రాయాలను, నివేదికలను స్పష్టం చేసింది. సుశాంత్‌ది ఆత్మహత్యే అని ధృవీకరించింది అని సుదీర్ గుప్తా తెలిపారు. అయితే సుధీర్ గుప్తా తన నివేదిక విషయంలో మాట మార్చడంపై సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాయర్ వికాస్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను యూటర్న్ తీసుకోవడం వెనుక అసలు కారణమేమిటో అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.

    English summary
    AIIMS doctor Sudhir Gupta has given clarity about Sushant Singh Rajput death. Dr Sudhir Gupta had released a statement that, Yes, everyone doubted when CBI started its investigation. We investigated all doubts and then came with this opinion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X