బ్రేకింగ్: సుశాంత్‌ మరణంపై ఎయిమ్స్ డాక్టర్ సంచలన ప్రకటన.. ఆ రోజు జరిగింది అదే అంటూ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఆత్మహత్య కాదంటూ కొద్దికాలంగా జరుగుతున్న వాదనకు తెరపడింది. ఈ కేసు విచారణను సీబీఐ చేపట్టిన తర్వాత పోస్టుమార్టం, విసేరా రిపోర్టులను మరోసారి పరిశీలించాలని, పరిశోధించాలని చేసిన సూచనతో ఎయిమ్స్ వైద్యులు తాజాగా నివేదికను సమర్పించారు. ఈ క్రమంలో వారు ఇచ్చిన నివేదికపై ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏమిటంటే..

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్‌ది హత్య కాదు! - AIIMS Report || Oneindia Telugu
సీబీఐకి ఎయిమ్స్ రిపోర్టు

సీబీఐకి ఎయిమ్స్ రిపోర్టు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం, విసేరా రిపోర్టులను ఎయిమ్స్ వైద్యులు బృందం ఇటీవల పరిశీలించింది. సుశాంత్ ల్యాప్‌టాప్, రెండు హార్డ్ డిస్కులను, ఓ కెమెరా, రెండు మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షించిన తర్వాత సీబీఐకి నివేదికను సమర్పించారు.

సుశాంత్ మరణంపై డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన ప్రకటన

సుశాంత్ మరణంపై డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన ప్రకటన

ఎయిమ్స్ వైద్యుల బృందం నివేదిక సమర్పించిన అనంతరం డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా క్లారిటీ ఇచ్చారు. హత్య చేయడం వల్ల సుశాంత్ మరణించలేదు. ఈ కేసులో హత్యకోణం లేదు అని సుధీర్ గుప్తా అనేక అనుమానాలకు తెరదించారు. అయితే సుశాంత్ సింగ్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుధీర్ ప్రకటన అందర్ని విస్మయానికి గురిచేసేలా ఉంది.

లాయర్ వికాస్ సింగ్ ట్వీట్‌కు విరుద్ధంగా

లాయర్ వికాస్ సింగ్ ట్వీట్‌కు విరుద్ధంగా

అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది 200 శాతం హత్యే అంటూ ఎయిమ్స్ వైద్యులు తనతో చెప్పారని కుటుంబ లాయర్ వికాస్ సింగ్ చేసిన ట్వీట్ చేయడం సంచనలం రేపింది. అయితే ఇప్పుడు ఎయిమ్స్ వైద్యులే సుశాంత్‌ది ముమ్మాటికి హత్య కాదు అని చెప్పడం మరో వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నది.

 సీబీఐ దర్యాప్తు మరో కోణంలో

సీబీఐ దర్యాప్తు మరో కోణంలో

ఇదిలా ఉండగా, సుశాంత్ మరణంపై ఎయిమ్స్ వైద్యులు రిపోర్టులో తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసిన తర్వాత సీబీఐ దర్యాప్తును మరో కోణంలో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవడం వెనుక అసలు కారణాలు ఏంటి? సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరిపించిన అంశాలపై సీబీఐ దర్యాప్తు చేస్తుందనే విషయాన్ని అధికారులు వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X