సుశాంత్ సూసైడ్‌లో సంచలన విషయాలు వెలుగులోకి.. సీబీఐ చేతికి ఎయిమ్స్ పోస్ట్‌మార్టం, విసేరా రిపోర్ట్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసులో వ్యక్తమవుతున్న అనుమానాలు, వివాదాల నేపథ్యంలో సీబీఐకి ఎయిమ్స్ హాస్పిటల్‌కు చెందిన ఫోరెన్సిక్ విభాగం పోస్ట్ మార్టం, విసేరా రిపోర్టులను అందజేసింది. దాంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జాతీయ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. అయితే తాజా కథనాల ప్రకారం..

సుశాంత్‌ది సూసైడ్ అని చెప్పలేం

సుశాంత్‌ది సూసైడ్ అని చెప్పలేం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సూసైడ్ అని కచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. హత్య కూడా జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎయిమ్స్ వైద్యులు తమ రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం. సుశాంత్ ఉరి వేసుకొన్న తీరు చూస్తే అలాంటి అనుమానాలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదనే అభిప్రాయాన్ని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చెప్పినట్టు కథనాల్లో పేర్కొంటున్నారు.

హత్య కోణంలో సీబీఐ దర్యాప్తు

హత్య కోణంలో సీబీఐ దర్యాప్తు

సుశాంత్ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు, అలాగే కూపర్ హాస్పిటల్ వైద్యులు అందించిన పోస్ట్‌మార్టం, విసేరా రిపోర్డులపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో సీబీఐకి ఈ కేసును అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ ప్రొఫెషనల్ పద్దతుల్లో దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో సుశాంత్‌ మరణంలో హత్యాకోణాన్ని కొట్టపడేయలేమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో హత్య కోణంలో సీబీఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

సీబీఐ, ఎయిమ్స్ మధ్య చర్చ

సీబీఐ, ఎయిమ్స్ మధ్య చర్చ

సుశాంత్‌కు సంబంధించిన పోస్ట్‌మార్టం, విసేరా రిపోర్టులను సీబీఐకి అప్పగించిన తర్వాత డాక్టర్ దీక్షిత్ గుప్తా మాట్లాడుతూ... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ, ఎయిమ్స్ సంయుక్తంగా విచారణ చేస్తున్నది. ఈ హత్యకేసులో మా మధ్య చర్చ జరుగాల్సిన అవసరం ఉంది. కొన్ని న్యాయపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కూపర్ హాస్పిటల్ రిపోర్టుపై క్లీన్ చిట్ ఇవ్వలేదు అని పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి

302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి

ఇదిలా ఉండగా, సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడక నడుస్తున్నదని లాయర్ వికాస్ సింగ్ చేసిన ట్వీట్ మీడియాలో దుమారం రేపింది. సుశాంత్‌ది 200 శాతం హత్యేనని ఎయిమ్స్ వైద్యులు చెప్పారని ట్వీట్లో పేర్కొన్నడం సెన్సేషనల్‌గా మారింది. ఇలాంటి వివాదం నేపథ్యంలో సీబీఐకి ఎయిమ్స్ వైద్యులు రిపోర్టులు సమర్పించడం ఈ కేసు దర్యాప్తు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సుశాంత్‌ కేసును సూసైడ్ కాకుండా 302 సెక్షన్‌ కింద నమోదు చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X