For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రీత్ విడుదలపై ఐశ్వర్యారాయ్ ఆనందం... భర్త కోసం ట్విట్టర్ లో లవ్ మెసేజ్

    |

    ఓ పిల్లకు తల్లైనా వన్నెతరగని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉన్న ఐశ్వర్యారాయ్, సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటుంది. ముందు నుంచి పర్శనల్ లైఫ్ గురించి కాస్త గుట్టుగా ఉండే ఐష్, బచ్చన్ల ఇంటి కోడలు అయ్యక మరింత సీక్రెసీ మెయిన్ టెయిన్ చేసేందుకు ట్రై చేస్తోంది. అయితే, తాజాగా అమ్మడు ఈ రూల్ ను కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

    ఈ మధ్యకాలంలో నిర్మాతగా బిజీగా మారిన అభిషేక్ బచ్చన్, సిల్వర్ స్క్రీన్ కు దూరంగా జరిగాడు. 2018లో మన్మర్జియా సినిమాలో తాప్సీతో కలిసి నటించిన తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు. తాజాగా బ్రీత్ వెబ్ సిరీస్ తో మళ్లీ జనాల ముందుకు వచ్చాడు. ఇక అబ్బాయిగారు సినిమా వస్తోంది అనేసరికి ఐశ్వర్యా రాయ్ కూడా ఆనందం పట్టలేక సోషల్ మీడియాలో భర్తపై ప్రశంసలు కురిపించేస్తోంది.

    Aish all proud of Husband, took twitter to show some Love

    బ్రీత్ విడుదల సందర్భంగా ట్విట్టర్ లో ఓ చిన్న పోస్ట్ పెట్టింది ఐశ్వర్య. షైన్ ఆన్ బేబీ, హ్యాష్ ట్యాగ్ బ్రీత్ అంటూ అతి చిన్న పోస్టే పెట్టిన అది పెద్ద వైరల్ గా మారింది. మరి ఐష్ ట్వీట్ చేయడం అంటే మాటలా ఏంటి. ఇక దీనికి అభిషేక్ కూడా అంతే స్వీటుగా రిప్లై ఇచ్చాడు.

    లవ్ యూ థాంక్యూ అంటూ ట్వీటాడు. అసలు పీడీఏను ఇష్టపడని ఈ అందల జంట... ఇలా సోషల్ మీడియాలో ప్రేమను కలబోసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారనే చెప్పాలి. మరి ఇదే విధంగా ఈ ముచ్చటైన జంట త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమంటారేమో చూడాలి.

    English summary
    Otherwise not so active on Social Media, Aishwarya Rai too twitter to wish her darling hubby, on his latest release Breathe. Wishes him with a sweet note - SHine on Baby.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X