twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యరాయ్ బర్త్ డే: భార్యతో కలిసి రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన అభిషేక్!

    |

    బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన ప్రియమైన భార్య ఐశ్వర్యరాయ్ 45వ పుట్టినరోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ సందర్భంగా తన లవ్లీ వైఫ్‌తో దిగన ఓ క్యూట్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఆమెతో ఎక్కడ ఉన్నా ఆ ప్లేస్ హ్యాపీగా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.

    'హ్యాపీ బర్త్ డే వైఫ్.. ఐ లవ్ యూ అంటూ ఐశ్వర్యతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన అభిషేక్.... 'ఇదే నా హ్యాపీ ప్లేస్' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఐశ్వర్య బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఇదే నా హ్యాపీ ప్లేస్

    ఐశ్వర్యరాయ్‌తో కలిసి అభిషేక్ బచ్చన్ రొమాంటిక్ పిక్. అభిషేక్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా దీన్ని షేర్ చేశారు. ఈ ఫోటోకు అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు లక్షన్నరకు అభిమానులు దీన్ని లైక్ చేశారు.

    మిడ్ నైట్ సెలబ్రేషన్

    ఐశ్వర్యరాయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. నిన్న రాత్రి 12 గంటల తర్వాత స్నేహితులంతా కేక్‌తో ఐష్ వద్దకు వచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఆమె పుట్టింట్లో ఈ మినీ ఈవెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఇందులో అమితాబ్, జయా బచ్చన్ కనిపించలేదు.

    తల్లితో కలిసి ఐశ్వర్యరాయ్

    ఈ ఫోటోలను ఐశ్వర్యరాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో ఐశ్వర్యరాయ్ తల్లి బృందా రాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య, మరికొందరు స్నేహితులు ఉన్నారు. బ్యాగ్రౌండ్లో ఐశ్వర్యరాయ్ తండ్రి ఫోటో సైతం స్పష్టంగా కనిపిస్తోంది.

    గోవాలో...

    గోవాలో...

    గురువారం ఉదయం అభిషేక్ బచ్చన్ తన భార్య, కూతురుతో కలిసి గోవాలో ల్యాండ్ అయ్యారు. గోవా ఎయిర్‌పోర్టులో మీడియాకు వీరి ఫోటోస్ చిక్కాయి. ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ తెలుపు రంగు డ్రెస్సులో మెరిసిపోయారు. ఈ వీకెండ్ ఇక్కడే గడుపుతారని సమాచారం.

    ఐశ్వర్యరాయ్

    ఐశ్వర్యరాయ్

    ఐశ్వర్యరాయ్ చివరగా ‘ఫన్నేఖాన్' అనే సినిమాలో నటించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో ఆమె తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘గులాబ్ జామూన్' అనే చిత్రంలో నటించనున్నారు. ఈ ఇద్దరు 2010లో వచ్చిన రావణ్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Abhishek Bachchan shared the cutest post or Aishwarya Rai on her 45th birthday and even called her his ‘happy place’. “Happy Birthday Wife. I love you! #MyHappyPlace,” he captioned a beautiful black and white photo of the two.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X