Aishwarya Rai: ఐశ్వర్య పేరులో ‘బచ్చన్’ మిస్సింగ్.. వారి వైవాహిక బంధం ముగిసినట్టేనా?
Aishwarya Rai- Abhishek Bachchan divorce: బాలీవుడ్ స్టార్ కపుల్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్. వీరిద్దరూ తమ జీవితాన్ని సంతోషంగా లీడ్ చేస్తున్నారు. కానీ, గత కొంతకాలంగా ఈ జంట మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, దీంతో వారు తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకాలని భావిస్తున్నారనీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఐశ్వర్య- అభిషేక్‌ల విడాకుల పుకార్లపై అమితాబ్ బచ్చన్ స్వయంగా స్పందించారు. దీంతో ఆ పుకార్లకు బ్రేక్ పడినా.. తాజా మరోసారి స్టార్ కపుల్ విడిపోయారనే పుకార్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యరాయ్ ల గురించి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తమకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా గుర్తింపు, హోదా సంపాదించుకున్నారు. వీరి తమ కెరీర్ ఫీక్స్ లో ఉన్నప్పుడే 2007లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 'ఆరాధ్య' అనే కూతురు కూడా ఉంది. గత 16 ఏండ్లుగా వీరు తమ వైవాహిక బంధాని సాఫీగా సాగిస్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థాలు తలెత్తాయనీ, వీరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయనీ, త్వరలో అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా జరుగుతోంది.

దాదాపు ఏడాది నుంచి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు వైవాహిక జీవితంపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ, ఎవరి నుంచి క్లారిటీ మాత్రం లేదు. ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళినా.. ఒంటరిగా వెళ్లడం లేదా తన కూతురు ఆరాధ్యతో వెళ్తోంది. విదేశాలకు కూడా ఒంటరిగానే వెళ్తోంది. ఈ తరుణంలో ఐశ్వర్య ఓ డాక్టర్ ను ప్రేమిస్తుందని అతన్ని వివాహం చేసుకునే అవకాశం ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో అభిషేక్ బచ్చన్.. బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నారనీ, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ, పైగా ఆ నటి ఇటీవల గర్భవతి అయిందనే రూమార్స్ కూడా వచ్చాయి. ఈ రూమార్స్ పై గత వారం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. అనవసరంగా పుకార్లు క్రియేట్ చెయొద్దని హెచ్చరించారు.
నటి ఐశ్వర్య రాయ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో నటి లైమ్‌లైట్‌లో మెరిసిశారు. ఈ కార్యక్రమంలోవేదికపై కూడా ఐశ్వర్య కనిపించింది. ఈ అమ్మడు వేదికపైకి వచ్చిన వెంటనే.. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్ద స్క్రీన్‌పై "ఐశ్వర్య రాయ్, ఇంటర్నేషనల్ స్టార్" డిప్లే చేయబడింది. ఐశ్వర్య రాయ్ పేరు ప్రదర్శించడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. అదే సమయంలో ఐశ్వర్య పేరులో 'బచ్చన్' అనే ఇంటిపేరు కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలో ఐశ్వర్య పేరులో బచ్చన్ అనే ఇంటిపేరు కనిపించకపోవడంతో విడాకుల పుకార్లలకు ఊతమిచ్చినట్టు అయింది. మరోసారి స్టార్ కపుల్స్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, విడాకులకు బచ్చన్ ఫ్యామిలీ సమ్మతి తెలుపకున్నా.. ఐశ్వర్య మాత్రం విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ పలు రూమర్స్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఈ పుకార్లకు ఎండ్ కార్డు పడాలంటే.. ఐశ్వర్య బచ్చన్ గాని.. అభిషేక్ బచ్చన్ గాని ఎవరో ఒకరు ఈ విషయంపై నేరుగా మాట్లాడాల్సిందే. అప్పుడే ఈ పుకార్లకు తెర పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఐశ్వరరాయ్ గాని అభిషేక్ బచ్చన్ గాని స్పందిస్తారో లేదో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











