Divorce: మరోసారి అభిషేక్‌తో విడాకుల రూమర్స్.. ఐశ్వర్య కావాలనే ఆ తప్పు చేసిందా?

బాలీవుడ్‌ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వ్యవహారంపై జాతీయ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పలు కథనాలు బయటకు వచ్చాయి. పెద్ద ఎత్తున వార్తలు బయటకు వస్తున్న వారిద్దరూ మౌనంగా ఉండటంతో అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మరోసారి పుకార్లు ఊతమిచ్చేట్టుగా మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సారి హీరోయిన్ ఐశ్వర్యరాయ్ చేసిన ఓ తప్పిదంతో మరోసారి రూమార్స్ వెలువడుతున్నాయి. ఈ పుకార్లు ఊతమిచ్చేలా ఐశ్వర్య రాయ్ చర్యలు ఉండటంతో విడాకులు వార్తలు నిజమేనంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి.ఇంతకీ ఐశ్వర్య రాయ్ చేసిన తప్పిందేంటీ? విడాకుల రూమర్స్ మరో సారి తెరమీదికి రావడానికి కారణమేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

బాలీవుడ్‌ స్టార్ హీరో, హీరోయిన్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లు 2007లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ప్రేమకు గుర్తుగా 2011లో ఆరాధ్య పుట్టింది. 16 ఏళ్లు బాగానే సాగింది. కానీ గత కొత్త కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారిద్దరి వేరు వేరుగా ఉంటున్నట్టు పలు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తామిద్దరం కలిసే ఉన్నామని, విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినా.. అమితాబ్ కూడా తాము కలిసే ఉన్నామని వెడ్డింగ్ రింగ్ చూపించి ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ,ఆ రూమార్స్ ను మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.

Aishwarya Rai - Abhishek Bachchan Divorce Rumours Aishwarya Rai Steps Out Without Her Wedding Ring

అంబానీ ఇంట పెళ్లి సమయంలో అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమార్స్ పెద్ద ఎత్తున్న తెర మీదకు వచ్చాయి. ఫోటో సెషన్‌లో భాగంగా బచ్చన్ ఫ్యామిలీతో కాకుండా ఐశ్వర్యరాయ్ ఒక్కరే ఫొటోలు దిగడంతో.. అభిషేక్ - ఐష్ జంట విడాకులపై చర్చ నడిచింది. ఈ ఘటన తర్వాత ఐశ్వర్యరాయ్ తన కూతురుతో కలిసి విదేశాలకు వెళ్లడంతో మరోసారి వీరి విడాకులు తెర మీదకు వచ్చాయి. ఈ సమయంలో ఆరాధ్య పుట్టిన తర్వాత తన జీవితం పూర్తి మారిపోయిందని ఐశ్వర్యరాయ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

తాజాగా మరోసారి విడాకుల రూమార్స్ తెరమీదికి వచ్చాయి. నిన్న హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలసి దుబాయ్ లో జరుగుతున్న ఓ అవార్డ్ ఫంక్షన్‌కి హాజరవుతున్నారు. ఈ తరుణంలో దుబాయ్ కు చేరుకున్న తల్లీ కూతుళ్లకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అలాగే.. అక్కడి చేరుకున్న ఫ్యాన్స్ కూడా ఐశ్వర్యను పూల బొకేలు, గిప్పులు ఇస్తూ.. ఎంతో గ్రాండ్ గా ఆహ్వానించారు. ఈ క్రమంలో ఐశ్వర్య- ఆరాధ్యలు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక్కడ ఐశ్యర్య చేసిన తప్పును కనిపెట్టారు.

Aishwarya Rai - Abhishek Bachchan Divorce Rumours Aishwarya Rai Steps Out Without Her Wedding Ring

ఈ సమయంలో హీరోయిన్ ఐశ్వర్య చేతిలో పెళ్లి ఉంగరం కనిపించకపోవడాన్ని మీడియా, ఫ్యాన్స్ గమనించారు. ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో మరోసారి అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకులు తెర మీదకు వచ్చాయి. ఇంతకీ ఐశ్వర్య - అభిషేక్‌ లు రిలేషన్స్ లో ఉన్నారా? లేదా ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఐశ్వర్య - అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్య, అభిషేక్‌లతో పాటు బచ్చన్ కుటుంబం నుండి ఎవరూ కూడా ఈ విభేదాల వార్తలపై ఏమీ మాట్లాడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X