Divorce: ఐశ్వర్యతో అభిషేక్ విడాకులు.. సెప్టెంబర్ డెడ్‌లైన్.. బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కాపురంలో విభేదాలు, కలతల వ్యవహారం మీడియాలో గత కొద్ది నెలలుగా రచ్చ జరుగుతూనే ఉంది. అయితే వారి మధ్య అసలు ఏం జరిగింది? ఏం జరగబోతున్నది? వారి మధ్య దాంపత్యపరమైన సమస్యలకు కారణాలు ఏమిటనే విషయంపై రకరకాల ఉహాగానాలు మీడియాలో కనిపించాయి. అయితే వారి కాపురంలో సఖ్యత కలుగడానికి ఓ జ్యోతిష్యురాలు ఓ డెడ్‌లైన్, అలాగే ఓ సలహాను ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఉత్తరాదికి చెందిన జ్యోతిష్యురాలు చెప్పిన విషయాల్లోకి వెళితే..

అభిషేక్, ఐశ్వర్య సంసారంలో విభేదాలకు కారణం అత్త జయబచ్చన్ అని, అలాగే మరదలు ఓ కారణమని గాసిప్స్ వినిపించాయి. అయితే ఐశ్వర్యకు అత్తకు మధ్య సరిగాలేదని, విడాకులు తీసుకొన్న మరదలు వల్ల ఇంట్లో సమస్యలు వచ్చాయని, దాంతో అభిషేక్, ఐశ్వర్య మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన మీడియాలో వినిపించింది. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల మీడియాలో గందరగోళం ఏర్పడింది.

Aishwarya Rai Bachchan divorce

ఇలాంటి రూమర్లు మీడియాలో వినిపిస్తుండగానే.. ఐశ్వర్యకు, అభిషేక్ మధ్య ఓ హీరోయిన్ పేరు వినిపించింది. బాలీవుడ్‌కు చెందిన నిమ్రత్ కౌర్‌తో చోటా బచ్చన్ అఫైర్ గురించి గట్టిగానే రూమర్లు వ్యాపించాయి. అభిషేక్ వల్ల నిమ్రత్ గర్బం దాల్చిందనే పుకారు కూడా మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే ఇలాంటి రూమర్లన్నీ కొద్దికాలమే నిలిచాయి. అయితే వారిద్దరి విడాకుల వార్త మీడియాలో అడపదడపా వినిపిస్తునే ఉంటుంది.

బాలీవుడ్‌లో ప్రముఖ యూట్యూబర్‌కు ప్రముఖ జ్యోతిష్యురాలు, టారోట్ కార్డు రీడర్ డాక్టర్ గీతాంజలి సక్సేనా తాజాగా అభిషేక్, ఐశ్వర్య కాపురం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. వారిద్దరి మధ్య దాంపత్యపరమైన కలహాలు కొద్దికాలం వరకు సాగుతూనే ఉంటాయి. వచ్చే సెప్టెంబర్ వరకు వారి మధ్య కీచులాట ఉంటుంది. ఆ తర్వాత వారి తీసుకొనే నిర్ణయాలపైనే వారి సంసారం ముందుకు కొనసాగుతుందని ఆమె చెప్పారు.

సెలబ్రిటీలైనా, సాధారణ దంపతులైనా ప్రతీ ఒక్కరి సంసారంలో ఇలాంటి కలతలు ఉంటాయి. వాటిని కాదనలేము. కానీ అభిషేక్, ఐశ్వర్య మధ్య ఉన్న సమస్య భావోద్వేగాలకు సంబంధించి కాదు. వారి మధ్య ఉంది డబ్బు పరమైన సమస్య. కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు వారి దాంపత్య జీవితాన్ని డిస్ట్రబ్ చేశాయి. వాటికి పరిష్కారం లభిస్తే వారి మ్యారేజ్ లైఫ్‌లో ఎలాంటి సమస్యలు ఉండవు అని అన్నారు.

తమ మధ్య చోటు చేసుకొన్న విభేదాలను పరిష్కరించుకొనే పనిలో ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఉన్నారు. సెప్టెంబర్ వరకు వారి మధ్య జరగకూడని విషయాలు ఏమైనా జరిగితే తప్పా ఎలాంటి నష్టం ఉండదు. ఒకవేళ ఊహించని పరిణామాలు జరిగితే చెప్పలేం. సెప్టెంబర్ దాటిందంటే.. వారి కాపురానికి ఎలాంటి ఢోకా ఉండదు అని గీతాంజలి సక్సేనా చెప్పారు. అయితే ఈమె ఊహించినట్టు సెప్టెంబర్ తర్వాత వారిద్దరి కాపురం చక్కదిద్దుకోవాలని అభిమానులు, సన్నిహితులు ఆశిస్తున్నారు. ఇకనైనా ఇలాంటి రూమర్లకు చెక్ పడేలా వారిద్దరూ కలిసి ఉండాలని కోరుకొంటున్నారు.

More from Filmibeat

Read more about: aishwarya rai abhishek bachchan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X