Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్‌గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఐశ్వర్య మాజీ ప్రియుడితో అభిషేక్ అలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించలేదు!
Recommended Video
కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపడే సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ మంచి స్నేహితులు అవుతారని ఎవరు భావించారు? అలియా భట్, రణబీర్ కపూర్ లవ్ బర్డ్స్‌గా మారతారని మీరు ఎప్పుడైనా ఊహించారా?
ఇలా ఆశ్చర్యపడే సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఐశ్వర్యరాయ్ మాజీ ప్రియుడు వివేక్ ఒబెరాయ్ ఎదురు పడితే... ఆమె భర్త అభిషేక్ బచ్చన్ అతడిని అవాయిడ్ చేస్తారని అంతా అనుకుంటారు, కానీ ఇటీవల ఈ ఇద్దరూ ఎదురుపడినపుడు అభిషేక్ అతడిని హృదయపూర్వకంగా కౌగిలించుకుని పలకరించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
అభిషేక్ తీరుపై ఐశ్వర్య అసంతృప్తిగా ఉన్నారా?
అభిషేక్ చేసిన ఈ పనిని చాలా మంది నెటిజన్లు ప్రశంసించగా, కొందరు మాత్రం అతడి తీరును తప్పుబట్టే ప్రయత్నం చేశారు. బాలీవుడ్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం... ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా అభిషేక్-వివేక్ 'ఓవర్ ఫ్రెండ్లీ' కౌగిలింత విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అలా చేస్తే సరిపోయేది
ఓ ఆంగ్లపత్రిక రిపోర్ట్ ప్రకారం... "అభిషేక్ ఇలా కౌంగిలించుకోవడంపై అతడి అర్దాంగి ఏమంత సంతోషంగా లేరని, ఒబెరాయ్ ఎదురు పడినపుడు పొలైట్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతే సరిపోయేది, మరీ అలా కౌగిలించుకోవాల్సిన అవసరం ఏముంది?'' అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయట.
అభిషేక్ వివేక్‌ను ఎందుకు కౌగిలించుకున్నాడు?
బచ్చన్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవారు చెబుతున్నదాన్ని బట్టి "ఐశ్వర్యరాయ్ విషయంలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ అప్పట్లో గొడవపడ్డారు, సల్మాన్ ఖాన్ బిహేవియర్ తప్పుపడుతూ ఓబరాయ్ అప్పట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య శతృత్వం మరింత పెరిగింది. అయితే లైఫ్‌లో ఇలాంటి నెగెటివ్‌నెస్ లేకుండా పాజిటివ్‌గా ముందుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే అభిషేక్ అలా చేశాడట''
ఐశ్వర్య రాయ్ ఎప్పటికీ వివేక్‌ను మన్నించదా?
వివేక్ ఒబెరాయ్ చేసిన ఒక వెర్రి తప్పుకు అభిషేక్ క్షమించి ఉండవచ్చు, ఐశ్వర్య రాయ్ మాత్రం గతాన్ని మరిచిపోయే పరిస్థితిలో లేదు. అతడు చేసిన పనులను క్షమించే మూడ్‌లో కూడా ఆమె లేదని అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వివేక్ ఒబెరాయ్ వల్ల ఈ మాజీ విశ్వసుందరి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొందో....
ఐశ్వర్య-అభిషేక్ వర్క్ విషయానికొస్తే...
అభిషేక్ బచ్చన్ త్వరలో తరువాత అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఐశ్వర్యరాయ్ తన తర్వాతి సినిమా మణిరత్నం తెరకెక్కించబోయే మెగా ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్'లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.