ఐశ్వర్య, ఆరాద్యలకు కరోనా పాజిటివ్.. బచ్చన్ ఫ్యామిలీకి షాక్
బచ్చన్ ఫ్యామిలికి కరోనా సోకిందనే వార్త కేవలం బాలీవుడ్‌నే కాదు యావత్ సినీ పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. మొదటగా అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు మాత్రమే కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి అమితాబ్ ఈ మేరకు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. తనకు, అభిషేక్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన అమితాబ్.. మిగతా వారి రిపోర్ట్స్ రావాలని చెప్పుకొచ్చాడు.
Recommended Video

ఆస్పత్రిలో అమితాబ్..
అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకిందనే వార్త బయటకు రాగానే అంతా షాక్‌కు గురయ్యారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు, అభిషేక్‌కు కరోనా వచ్చిందని, నానావతి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నామని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందకండని వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

మొదటి పరీక్షలో సేఫ్..
అమితాబ్, అభిషేక్‌లకు కరోనా రావడంతో మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే మొదటి సారి టెస్ట్ చేసినప్పుడు జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆరాద్యలకు కరోనా నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ రెండోసారి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

ఐశ్వర్య, ఆరాద్యలకు పాజిటివ్..
రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో ఐశ్వర్యా రాయ్, ఆరాద్యలకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బచ్చన్ ఫ్యామిలీకి కరోనా పెను శాపంగా మారింది. వీరంతా త్వరగా కోలుకోవాలని అభిమానులే కాక సెలెబ్రిటీలు సైతం ప్రార్థనలు చేస్తున్నారు. వీరందరిలో కెల్లా జయా బచ్చన్‌కు మాత్రమే కరోనా నెగెటివ్ వచ్చింది.

ఆ ప్రాంతమంతా..
బచ్చన్ ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించగా ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి బచ్చన్ ఫ్యామిలీ నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.


Click it and Unblock the Notifications











