ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనావైరస్ నెగిటివ్.. బిగ్ బీ ఫ్యాన్స్‌కు ఊరట
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కుటుంబానికి ఊరట లభించింది. బిగ్ బీ కుటుంబం అంతా కరోనావైరస్ బారిన పడటంతో ఇంటి సభ్యులందరూ హాస్పిటల్‌లో చేరడం తెలిసిందే. ఆ నేపథ్యంలో వారి అధికార నివాసం జల్సాను ముంబై అధికారులు కంటైన్‌మెంట్‌లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వారి కుటుంబానికి కరోనా తీవ్రత తగ్గడంతో ఆ కుటుంబానికి ఉపశమనం లభించింది. వివరాల్లోకి వెళితే..
Recommended Video

జూలై 12 రాత్రి అమితాబ్‌కు కరోనా పాజిటివ్ అని
జూలై 12వ తేదీన తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిందని స్వయంగా ట్విట్టర్‌లో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వెల్లడించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత వెంటనే అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్యరాయ్‌కి కూడా కోవిడ్19 పాజిటివ్ అనే వార్త బయటకు రావడం ఫ్యాన్స్‌ను మరింత ఆందోళనకు గురిచేసింది. బిగ్ బీ కుటుంబం త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయడం తెలిసిందే.

ప్రస్తుతం ఐశ్వర్య, ఆరాధ్యకు నెగిటివ్
అమితాబ్ కుటుంబంలోని ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ తాజాగా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కరోనావైరస్ నెగిటివ్‌గా వచ్చింది. దాంతో బిగ్ బీ కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది. కరోనా నెగిటివ్ అని తేలగానే వారిని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేయడంతో జల్సాకు చేరుకొన్నారు.

కంటైన్‌మెంట్ జోన్ నుంచి తొలగింపు
ఇదిలా ఉండగా, కంటైన్‌మెంట్ జోన్ నుంచి బిగ్ బీ ఇంటిని తొలగిస్తూ ముంబై అధికారులు నిర్ణయం తీసుకోవడం మరో శుభవార్తగా మారింది. ఇలా రెండు విషయాలు బిగ్ బీ అభిమానులకు ఉపశమనం కలిగించాయి. అమితాబ్ కుటుంబ సభ్యులపై వ్యక్తమైన ఆందోళన కొంత మేరకు తగ్గుముఖం పట్టింది.

అభిషేక్ బచ్చన్ క్లారిటీ..
ఐశ్వర్య, ఆరాధ్య హెల్త్ రిపోర్టుపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఐశ్వర్యరాయ్, ఆరాధ్య బచ్చన్‌కు కరోనా నెగిటివ్ అని తేలడంతో వారిని నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. ఇంకా అమితాబ్‌కు కరోనా తీవ్రత తగ్గలేదు. ఇంకా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

అభిమానులకు ధన్యవాదాలు అంటూ అభిషేక్
తమ కుటుంబం త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. అమితాబ్‌తోపాటు మా కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని సందేశాలు వేల సంఖ్యలతో వస్తున్నాయి. అందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం. త్వరలోనే తాము కూడా నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతాం అని అభిషేక్ ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











