బ్రేకింగ్: హాస్పిటల్‌లో చేరిన ఐశ్వర్య బచ్చన్, ఆరాధ్య.. కరోనా తీవ్రతరం కావడంతో..
కరోనావైరస్ బారిన పడిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ ఇప్పటికే నానావతి హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ తన నివాసంలోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఇద్దరి పరిస్థితి కొంత సీరియస్‌గా ఉండటంతో నానావతికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
Recommended Video

అమితాబ్ ఫ్యామిలీకి కరోనావైరస్‌తో
జూలై 11వ తేదీ శనివారం అమితాబ్ ఫ్యామిలీకి కరోనావైరస్ సోకిందనే వార్తలు బాలీవుడ్ మీడియాను కుదిపేశాయి. అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నా ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్‌కు తరలించారు. నా కుటుంబ సభ్యులు, స్టాఫ్ కూడా కోవిడ్ టెస్ట్ జరిపించుకోవాలని హస్పిటల్ వర్గాలు సూచించాయి. గత 10 రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ దయచేసి వారంతట వారే పరీక్షలు నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను అని అమితాబ్ సూచించారు.

తన నివాసంలో క్వారంటైన్
అయితే శనివారం ఐశ్వర్యరాయ్, ఆరాధ్య, జయబచ్చన్‌కు కరోనా పాజిటివ్ అనే వార్తలు వచ్చినప్పటికీ.. వాటిని ఫ్యామిలీ మెంబర్స్ తొసిపుచ్చారు. ఆదివారం మధ్యాహ్నం వెల్లడైన ఫలితాల్లో ఐశ్యర్య, ఆరాధ్యకు పాజిటివ్, జయబచ్చన్‌కు నెగిటివ్ అని తేలాయి. కరోనా తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఇద్దరు తమ నివాసం జాల్సాలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. వారం రోజులుగా క్వారంటైన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకొంటున్నారు.

నానావతి హస్పిటల్ చేరిక
అయితే శుక్రవారం ఐశ్వర్య రాయ్, ఆరాధ్య జ్వరం తీవ్రత, ఒంటి నొప్పులు, కరోనా తీవ్రత ఎక్కువగా కనిపించడంతో ఆ ఇద్దరిని సాయంత్రం కూడా నానావతి హాస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని వారి సిబ్బంది మీడియాకు సమాచారం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి వివరాలు అందాల్సి ఉన్నాయి.

అమితాబ్ తన ఆరోగ్యంపై
కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతూ ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్‌లో శుక్రవారం స్పందించారు. నా ఆరోగ్యం కుదుట పడాలని మీరందరూ ప్రార్థనలు చేసినందుకు ధన్యవాదాలు. చాలా మంది నాకు ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్, బ్లాగ్స్‌తోపాటు సోషల్ మీడియా యాప్స్ ద్వారా నాకు సందేశాలు పంపారు. అందుకు నేను రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ నిబంధనలు అతిక్రమించి మరింత సమచారాన్ని ఇవ్వలేకపోతున్నాను. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











