twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో మరో విషాదం.. ఐశ్వర్యరాయ్‌తో నటించిన యువ నటుడు మ‌‌ృతి.. కారణమేమిటంటే!

    |

    ప్రముఖ నటులు రిషికపూర్, ఇర్ఫాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ మరణాల నుంచి ఇంకా కోలుకోలేని బాలీవుడ్‌ను మరో విషాదం వెంటాడింది. యువ నటుడు రంజన్ సెహగల్ శనివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ యువ నటుడు చంఢీగడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. యువ హీరో మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆ యువ హీరో మరణానికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

    టెలివిజన్ సీరియల్స్‌ ద్వారా బాలీవుడ్‌లోకి

    టెలివిజన్ సీరియల్స్‌ ద్వారా బాలీవుడ్‌లోకి

    యువ నటుడు రంజన్ సెహగల్ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితులు. పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన మంచి ప్రేక్షకాదరణ ఉంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, రణదీప్ హుడా నటించిన సరబ్‌జిత్ చిత్రం రంజన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన వయసు 36 సంవత్సరాలు. రంజన్ మృ‌తితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

    కొద్దికాలంగా అనారోగ్యంతో

    కొద్దికాలంగా అనారోగ్యంతో


    రంజన్ సెహగల్ కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలు అవయవాల వైఫల్యంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో ఆయన కొద్దికాలంగా క్వారంటైన్‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

    బాలీవుడ్‌లోకి ప్రవేశించి

    బాలీవుడ్‌లోకి ప్రవేశించి

    రంజన్ సెహగల్ కెరీర్ విషయానికి వస్తే.. థియేటర్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత జీ పంజాబీ టెలివిజన్ ఛానెల్‌తో పనిచేశారు. చడ్యా ఛాన్ సముందర్ పార్ అనే టీవీ సీరియల్‌తో యాక్టర్‌గా మారారు. సవాధన్ ఇండియా షో ద్వారా బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణను పొందారు. అనంతరం బాలీవుడ్‌లోకి ప్రవేశించి పలు చిత్రాల్లో నటించారు. షారుక్ ఖాన్ నటించిన జీరో చిత్రంతోపాటు పలువురు అగ్ర హీరోల సినిమాల్లో నటించారు.

    Recommended Video

    #AmitabhBachchan : Coronavirus సోకిన తరువాత మొదటిసారి మాట్లాడిన Amitabh Bachchan..!
    షాక్‌లో టెలివిజన్ ఇండస్ట్రీ

    షాక్‌లో టెలివిజన్ ఇండస్ట్రీ


    రంజన్‌కు టెలివిజన్ సీరియల్ క్రైమ్ పెట్రోల్ మంచి గుర్తింపు తెచ్చింది. ఆ సీరియల్ నటించిన నటీనటులు రంజన్ మృతితో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయనతో పరిచయం మాకు మంచి అనుభూతులను మిగిల్చింది. షూటింగ్ గ్యాప్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పేవారు. చార్లీ చాప్లిన్ గొప్పతనం గురించి చెబుతుంటూ అలా వింటూ ఉండిపోయే వాళ్లం అని రంజన్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు.

    English summary
    Aishwarya Rai Bachchan co-actor Sarbjit fame Ranjan Sehgal no more. He died with multiple organs failure and coronavirus symptoms. Actor Ranjan breathed his last in Post Graduate Institute of Medical Education & Research, Chandigarh on Saturday. The actor was quarantining there since some time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X