ఐశ్వర్యరాయ్ మాజీ మేనేజర్ సూసైడ్.. 14 అంతస్తుల భవనం నుంచి దూకి..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఓ బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. లాక్ డౌన్ సమయంలో పలువురు సీనీ నటులు సూసైడ్ చేసుకోవడంపై పరిశ్రమ వర్గాలు ఆందోళనలో ఉండగానే దిశా సూసైడ్ చోటుచేసుకోవడం షాక్ కలిగించింది. దాంతో కష్టాల్లో ఉన్న నటీనటులను ఆదుకోనేందుకు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి సమయంలోనే దిశ ఆత్మహత్య ప్రతీ ఒక్కరిని విషాదంలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే..

ముంబైలోని మలాడ్‌లో ఘటన
తాజా వార్తల ప్రకారం.. దిశ ముంబైలోని మలాడ్‌లోని 14 అంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోన్నారు. ఆమెను స్థానిక బోరివాలి హస్పిటల్‌కు వెంటనే తరలించారు. అయితే అప్పటికీ ఆమె మరణించారని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆమె జీవితం విషాదంగా మిగిలింది.

కాబోయే భర్తతో కలిసి
దిశా సలియాన్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కాబోయే భర్త వెంట ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఆత్మహత్యా ఘటన తర్వాత దిశ తల్లిదండ్రుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకొన్నారు. ఆతర్వాత కాబోయే భర్త నుంచి వివరాలు సేకరించి ఆయన వెర్షన్‌ను కూడా రికార్డు చేసినట్టు తెలిసింది.

పీఆర్వోగా కెరీర్ ప్రారంభించి
దిశ తన కెరీర్‌ను పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత సెలబ్రిటీ టాలెంట్ మేనేజర్‌గా మారారు. ముంబైలో ఆమె నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా బంటీ సజ్‌దే కార్నర్ స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌తో కొనసాగుతున్నారు.
Recommended Video

ఐశ్వర్యరాయ్, సుశాంత్ సింగ్‌కు మేనేజర్‌గా
గతంలో పలువురు సినీ సెలబ్రిటీలకు దిశ మేనేజర్‌గా పనిచేశారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, సుశాంత్ సింగ్, కమెడియన్ భారతీ శర్మ, హీరోయిన్ రియా చక్రవర్తి, యాక్టర్ వరుణ్ శర్మకు మేనేజర్‌గా పనిచేశారు. అంతేకాకుండా పీఆర్వోగా పలు సినిమాలకు సహాయ సహకారాలు అందించారు.


Click it and Unblock the Notifications











