Aishwarya Rai: ఐశ్వర్యరాయ్‌కి హ్యాండిచ్చిన వర్మ
గత కొద్దికాలంగా వరుస డిజాస్టర్లతో తన ప్రతిష్టను మసకబారేలా చేసుకొన్న దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. తన మార్కు తరహా సినిమాతో మళ్లీ పూర్వవైభవాన్ని చేజిక్కించుకొనేందుకు రెడీ అవుతున్నాడు. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ధురంధర్ 2 సినిమాకు తనదైన స్టయిల్‌లో ప్రమోషన్స్ చేస్తున్న ఆయన తన సొంత సినిమాపై దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన జాతీయ మీడియా ఐఏఎన్ఎస్ (IANS) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొత్త సినిమా గురించి వివరాలు వెల్లడించారు. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆర్జీవి వెల్లడించిన తాజా సమాచారం వివరాల్లోకి వెళితే..
ధురందర్ సినిమాపై వర్మ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు ఆదిత్య ధార్‌ను చూసి యువ దర్శకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శివ, సత్య సినిమాలు తీసిన సమయంలో తాను ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచాను. ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాయమే కాకుండా కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు అని వర్మ అన్నాడు.

ఇక తాను నిర్మిస్తున్న సర్కార్ 4 సినిమా గురించి వివరాలు అందించారు. ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా కథానేపథ్యం డిఫరెంట్. కొత్త ప్రపంచంలో కథ ముందుకు సాగుతుంది. బడ్జెట్ పరంగా చాలా లావిష్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. బిగ్ స్కేల్‌లో సినిమా ఉండబోతున్నది అని వర్మ తెలిపారు.
అయితే సర్కార్ 4 సినిమాలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలను పోషిస్తారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించడం లేదు. ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పాత్ర ఉండదు. అమితాబ్ సుభాష్ నాగ్రే, అభిషేక్ శంకర్ పాత్రల్లో కనిపిస్తారు అని తెలిపారు.
సర్కార్ సినిమా విషయానికి వస్తే.. 2005 సంవత్సరంలో రిలీజైంది. ఆ తర్వాత మూడేళ్లకు 2008 ఏడాదిలో సర్కార్ రాజ్ వచ్చింది. ఈ చిత్రంలో అనితా రాజన్‌గా ఐశ్వర్యరాయ్ నటించారు. 2017 సంవత్సరంలో సర్కార్ 3 రిలీజైంది. అయితే ప్రస్తుతం సర్కార్ 4 సినిమాను భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











