twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీటూ ఉద్యమం: అప్పుడే చెప్పా.. సల్మాన్‌పై ఐశ్యర్యారాయ్ హాట్ కామెంట్స్!

    |

    మీటూ ఉద్యమంతో బాలీవుడ్ అట్టడుగుతోంది. ప్రతి ఒక్క నటి, నటుడు లైంగిక వేధింపుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనుశ్రీ దత్త సంచలనకామెంట్స్ తో మొదలైన ఈ చర్చ తీవ్రంగా మారుతోంది. బాలీవుడ్ నటుల నుంచి వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు, నటీమణులు, ఇతర మహిళలు సోషల్ మీడియా వేదికగా వాస్తవాలు బట్టబయలు చేస్తున్నారు. ఎవరి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమో అనే భయాందోళన బాలీవుడ్ నటులు, దర్శక నిర్మాతల్లో నెలకొని ఉంది. తాజగా అందాల తార ఐశ్వర్యారాయ్ మీటూ ఉద్యమం గురించి, లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది.

    నానా పాటేకర్‌తో మొదలు

    నానా పాటేకర్‌తో మొదలు

    తనని హార్న్ ఒకే ప్లీజ్ సెట్ లో నానా పాటేకర్ లైంగికంగా వేధించడం వలన ఆ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు తనుశ్రీ దత్త చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలతోనే బాలీవుడ్ లో మీటూ మూమెంట్ మొదలైంది. కంగారనౌత్, స్వర భాస్కర్, ట్వింకిల్ ఖన్నా వంటి నటులంతా మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్నారు.

     తీవ్రమైన ఆరోపణలు

    తీవ్రమైన ఆరోపణలు

    మొదట నానా పాటేకర్ పై ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త ఆ తరువాత కొందరు దర్శకులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీ దత్త తరహాలోనే మరికొందరు నటీమణులు దర్శకులపై, నటులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనితో బాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

    స్పందించిన ఐశ్వర్యారాయ్

    స్పందించిన ఐశ్వర్యారాయ్

    మీటూ ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్న హీరోయిన్ల జాబితాలో ఐశ్వర్యారాయ్ కూడా చేరింది. ఇలాంటి విషయాలకు ఎప్పుడూ నా మద్దత్తు ఉంటుంది. లైంగిక వేధింపుల గురించి గతంలోనే నేను మాట్లాడా. ఇప్పుడు కూడా మాట్లాడుతా.. మాట్లాడుతూనే ఉంటా అంటూ ఐష్ తన స్పందన తెలియజేసింది.

     ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది

    ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది

    నటీమణులు, మహిళలు తమకు జరిగిన చేదు అనుభవాలని ప్రపంచానికి తెలియజేయడంలో సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. వారి భాదని ప్రపంచం మొత్తం వింటోంది. మీటూ ఉద్యమం పట్ల, సోషల్ మీడియా పట్ల తాను సంతోషంగా ఉన్నానని ఐశ్వర్యరాయ్ తెలిపింది. కోల్ కతాలో ఓ ఈవెంట్ లో పాల్గొంటూ ఐష్ మీటూ ఉద్యమం గురించి స్పందించింది.

     చాలా రోజులుగా

    చాలా రోజులుగా

    చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఇప్పుడు కొత్తగా రాలేదు. చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వేధింపులపై ఉద్యమం మొదలు కావడం సంతోషించదగ్గ విషయం అని ఐశ్వర్యారాయ్ తెలిపింది. గతంలో కూడా తాను లైంగిక వేధింపుల గురించి మాట్లాడానని పరోక్షంగా సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి మాట్లాడింది.

     కండల వీరుడితో బ్రేక్ అప్

    కండల వీరుడితో బ్రేక్ అప్

    2002 వరకు కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం సాగించిన ఐశ్వర్యారాయ్ ఆ తరువాత అతడి నుంచి విడిపోయింది. విడిపోయాక కూడా సల్మాన్ ఖాన్ తనని వేధించేవాడని గతంలో ఐశ్వర్యరాయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదృష్టం కొద్దీ ఆ చేదు జ్ఞాపకాలేవి తనకు గుర్తు లేవని ఐశ్వర్యరాయ్ తెలిపింది.

    సంజయ్ లీలా భన్సాలీ చిత్రంతో

    సంజయ్ లీలా భన్సాలీ చిత్రంతో

    1999 లో వచ్చిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రం హమ్ దిల్ డే చుకే సనమ్ చిత్రంతో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ మధ్య ప్రేమాయణం మొదలైంది. 2002 లో ఈ జంట విడిపోయారు. దేశవ్యాప్తంగా మీటూ మూమెంట్ గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

    English summary
    Aishwarya Rai Bachchan on MeToo: I Spoke in the Past, I am Speaking Now. Several celebs, including Sonam Kapoor, Swara Bhaskar, Twinkle Khanna and Priyanka Chopra, are supporting the movement
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X