twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్దె గర్భంతో తల్లిగా ఐశ్వర్యారాయ్.. కుదరదని చెప్పేసిందా!

    |

    మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ వివాహం తరువాత కూడా నటనలో రాణిస్తోంది. సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది. ఇటీవల ఓ సంచలన పాత్రకు ఐశ్వర్యారాయ్ అంగీకారం తెలిపినట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. సరోగసి విధానంతో తల్లి అయ్యే పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ చిత్రం పేరు జాస్మిన్. ఐశ్వర్యారాయ్ ఈ చిత్రానికి అంగీకారం తెలిపినట్లు రచయిత సిద్దార్థ్ గరిమ కూడా ధృవీకరించారు. తాజగా ఈ చిత్ర విషయంలో ఐశ్వర్యారాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    2.0లో ఐశ్వర్యరాయ్.. చిట్టి రోబోతో రొమాన్స్!2.0లో ఐశ్వర్యరాయ్.. చిట్టి రోబోతో రొమాన్స్!

    కథ నచ్చింది

    కథ నచ్చింది

    తాజాగా ఈ చిత్రం గురించి ఐశ్వర్యారాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయి చిత్రానికి సంబంధించిన కథా చిత్రాలు ఫిబ్రవరిలోనే ముగిసాయి. కథ నచ్చింది. కానీ కొన్ని మార్పులు చేయమని రచయితకు సూచించినట్లు ఐశ్వర్యారాయ్ తెలిపింది. వారినుంచి స్పందన లేకపోవడంతో ఈచిత్రంలో చేస్తానో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేసింది. తాను ఈ చిత్రం నుంచి తప్పుకున్న విషయాన్ని ఐశ్వర్యరాయ్ పరోక్షంగా చెప్పిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

    కథలో అనేక లోపాలు

    కథలో అనేక లోపాలు

    ఐశ్వర్యారాయ్ అంటే అభిమానులంతా అందాల తారగానే చూస్తారు. ఈ నేపథ్యంలో పంటికింద రాయిలా కథలో చాలా లోపాలు, తన ఇమేజ్ కు సరిపోని అంశాలు ఉండడంతో ఐశ్వర్యారాయ్ మార్పులు సూచించిందట. కానీ కథని కథని దృష్టిలో పెట్టుకుని రచయిత మార్పులు చేయలేదని అంటున్నారు.

    అద్దె గర్భం

    అద్దె గర్భం

    ఈ చిత్రంలో అద్దె గర్భం సరోగసి విధానం ద్వారా తల్లి అయిన మహిళ పాత్రలో ఐష్ నటించాల్సి ఉంది. తల్లి పాత్ర కనుక గ్లామర్ అంశాలకు కథ దూరంగా ఉంటుంది. పూర్తిగా డీగ్లామర్ పాత్ర అయినా వర్కవుట్ కాదనే ఉద్దేశంతో ఐష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

    అభిషేక్ బచ్చన్

    అభిషేక్ బచ్చన్

    ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ ఆచి తూచి మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉండగా తన భర్త అభిషేక్ బచ్చన్ తో కలసి ఓ చిత్రంలో నటించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Aishwarya Rai Bachchan turns down surrogacy drama Jasmine. Aishwarya Rai Bachchan will no longer play a surrogate mother in Jasmine
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X