మిస్ వరల్డ్ కిరీటంతోనే భోజనం చేసిన ఐశ్వర్యారాయ్.. నేలపై కూర్చొని..
ఐశ్వర్యారాయ్ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. అందనికి మరో రూపంలా ఉండే ఈ మిస్ వరల్డ్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం అబ్బాయిలు ఇప్పటికి కూడా ఎగబడిపోతారు. ఇండస్ట్రీలో ఎంతో అనుకువుగా ఉంటూ మంచి నటిగా గుర్తింపు అందుకుంది. అయితే ఇటీవల ఆమెకు సంబంధించిన ఒక ఫొటోని నటి అమీ జాక్సన్ షేర్ చేయడంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిస్ వరల్డ్ కిరీటం ఉన్నా కూడా ఎంతో సహజంగా నేలపై కూర్చొని తినడం హాట్ టాపిక్ గా మారింది.

చూడగానే అందమైన చిరునవ్వుతో
ఐశ్వర్యారాయ్ అనే పేరుకు మరో అర్థం అందం అనే చెప్పవచ్చు. చూడగానే అందమైన చిరునవ్వుతో అబ్బాయిలను మంత్ర ముగ్దులలను చేయగలదు. అప్పట్లో ఆమెతో నటించడానికి అగ్ర హీరోలు పోటీ పడేవారు. స్క్రీన్ పై ఐశ్వర్యారాయ్ కనిపిస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతగా ఫోకస్ అవ్వరనేది అందరికి తెలిసిన విషయమే.

1994లో మిస్ వరల్డ్
అందానికి తోడు ఐశ్వర్యారాయ్ కు నటన, డ్యాన్స్ మరో బోనస్ అని చెప్పవచ్చు. అందుకే ఆమెకు ఇప్పటికి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. 1994లో ఐశ్వర్య మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థాయిలో గుర్తింపు వస్తే ఎవరైనా సరే లెవెల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఐశ్వర్య అలా చేయకుండా చాలా ఒదిగి ఉండేందుకు ప్రయత్నం చేసింది.

అందానికి రాణి అంటూ
మిస్ ఇండియా గా గెలుపొందిన తరువాత కూడా ఐశ్వర్యారాయ్ నేలపై కూర్చొని భోజనం చేయడం వైరల్ గా మారింది. ఆ ఫొటోను మరొక బ్యూటీ అమీ జాక్సన్ షేర్ చేయడం విశేషమని చెప్పవచ్చు. అంతే కాకుండా ఆమె అందానికి రాణి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఫొటోలో ఆమె తల్లి కూడా ఉన్నారు. మెరూన్ కలర్ చీరలో తల్లితో కలిసి నేలపై కూర్చుని భోజనం చేస్తున్న ఐశ్వర్య మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Recommended Video

అగ్ర హీరోయిన్ గా దాదాపు
స్పూన్లు, ఫోర్కులు లాంటివి వాడకుండా తన స్వహస్తాలతోనే భోజనం చేస్తున్న విధానం అభిమానులకు మరింత నచ్చింది. ఇక ఐశ్వర్యారాయ్ కొన్నేళ్ల పాటు అగ్ర హీరోయిన్ గా దాదాపు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక 2007లో ఆమె అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఐశ్వర్య లిమిటెడ్ గా సినిమాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











