twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో హాలీవుడ్ మూవీకి కమిట్ కాబోతున్న ఐశ్వర్యరాయ్?

    |

    ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్ లాంటి హీరోయిన్లు ఈ మధ్య హాలీవుడ్ వెళ్లి తెగ హడావుడి చేస్తున్నారు కానీ... వీరికంటే కంటే ముందే అందాల సుందరి ఐశ్వర్యరాయ్ హాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారాం ప్రకారం మరో హాలీవుడ్ సినిమాకు ఐష్ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... ఐశ్వర్య ఓ హాలీవుడ్ ప్రాజుక్టుపై ఆసక్తిగా ఉందని, త్వరలోనే దానికి సైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంటుకు సంబంధించి పేపర్ వర్క్ ప్రాసెస్‌లో ఉన్నట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే త్వరలోనే ఈ ప్రాజుక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందట.

    Aishwarya Rais 6th Hollywood film soon?

    ఐశ్వర్యరాయ్ హాలీవుడ్ చిత్రసీమలో చేయబోయే 6వ సినిమా ఇది. గతంలో ఆమె బ్రైడ్ అండ్ ప్రెజుడిస్, ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, ది లాస్ట్ లెజియన్, ది పింక్ పాంథర్ 2 చిత్రాల్లో నటించారు. తనకు పశ్చిమాన మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ... హిందీ చిత్రసీమను వదిలేసి హాలీవుడ్లో సెటిలవ్వాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐష్ వెల్లడించారు.

    నేను ఇండియన్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు. ఈ పరిశ్రమలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు హాలీవుడ్లో నటించడానికి సిద్ధమే కానీ పూర్తిగా ఇండియన్ ఇండస్ట్రీని వదిలి వెళ్లే ఆలోచన లేదని ఐశ్వర్యరాయ్ తెలిపారు.

    English summary
    Aishwarya Rai Bachchan has shown interest in a Hollywood project and will soon sign it too. "Aishwarya has expressed interest in this Hollywood project. Paper work is in process. Hopefully, if things go well, an announcement is expected by the year end." A source sait to Bollywood media website.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X