ఆరాధ్య చేష్టలకు ఐశ్వర్య షాక్.. నెట్టింట్లో వీడియో వైరల్..

Aishwarya rai - aaradhya: మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు‌. ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని, వారి మధ్య విభేదాలు తలెత్తాయంటూ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. వాటిపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా క్లారిటీ ఇచ్చిన ఆ రూమర్స్ కు మాత్రం చెక్ పడటం లేదు. ఆ వార్తలకు పుల్ స్టాప్ పడటం లేదు. ఇదిలాఉంటే.. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్, తన గారాలపట్టి ఆరాధ్య కు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

ఇయర్ ఎండ్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేయడానికి పలువురు సినీ సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.. అలా ఐశ్వర్య- అభిషేక్ జంట కూడా ఇయర్ ఎండ్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేయడానికి ఫారిన్ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. ఆ వేడుకల్లో ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇలా శనివారం నాడు ముంబై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ తరుణంలో.. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య లు ముగ్గురు ముంబాయి ఎయిర్ పోర్టులో కనిపించారు.

Aishwarya Rai shocked as Aaradhya Bachchan Suddenly Jumped at Mumbai Airport

దీంతో అక్కడ అభిమానులు, మీడియా మిత్రులు వారితో ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు. దీంతో వారి నుండి బయటపడి, కెమెరా కంట చిక్కకుండా బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు అభిషేక్ అండ్ ఐశ్వర్య. ఈ తరుణంలో ఐశ్యర్య రాయ్ గారాలపట్టి ఓ చిలిపి పనిచేసింది. తన తల్లికి సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. నడుస్తుండగా.. సడన్ గా గాల్లోకి ఎగిరి ఐశ్వర్యరాయ్ కి ట్విస్ట్ ఇచ్చింది. దీంతో తన కూతురు ఇచ్చిన ట్విస్ట్ కు ఐశ్వర్య కంగారు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

వాస్తవానికి ఆరాధ్య ఒక్కసారిగా అలా ప్రవర్తించేసరికి ఐశ్వర్య కంగారు పడింది. ఎవరైనా వెనుకనుండి నెట్టేసారేమోనని భయపడింది ఐశ్వర్య. అదేం లేదని ఆరాధ్య చెప్పడంతో.. తన కూతురిపై కాస్త కోప్పడి.. జాగ్రత్తగా నడవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆరాధ్య నవ్వుతూ ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఆరాధ్య బచ్చన్ పెరిగి ఉండవచ్చు .కానీ, ఆమె చిన్నపిల్లలా ప్రవర్తిస్తుందని ఒకరు కామెంట్స్ చేయగా.. కూతురి చిలిపి చేష్టలకు తల్లి భయపడుతోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

అలాగే.. ఇప్పటివరకు ఐశ్వర్యరాయ్, అభిషేక్ లువిడాకుల వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. ఐశ్వర్య అండ్ అభిషేక్ జంట కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఆ వార్తలు ఉట్టి పుకార్లేనని అర్థమవుతోంది. ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన కూడా చెక్ పడలేదు. ఇప్పటికైనా విడాకుల వార్తలు ఆగుతాయో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X