డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్దమైన మరొ బిగ్ బడ్జెట్ మూవీ
ఓటీటీ రాజ్యం మళ్ళీ మొదలైంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఇప్పుడు ఓటీటీ డీల్స్ పై చర్చలు మొదలు పెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. అలాగే థియేటర్స్ కూడా ఓపెన్ కావడం లేదు. అందుకే రిస్క్ చేయడం ఎందుకు అని ఓటీటీ డీల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవల సల్మాన్ ఖాన్ రాధే సినిమా డైరెక్ట్ జీ5 లో విడుదల చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఒకేరోజు థియేట్రికల్ గా కూడా విడుదల కానుంది. ఇక మరొక బిగ్ బడ్జెట్ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అజయ్ దేవగన్ నటించిన బుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 13న థియేటర్స్ లోనే విడుదల కానున్నట్లు టాక్ వచ్చింది. ఇక కరోనా దెబ్బ పడడంతో చిత్ర నిర్మాతలు మనసు మార్చుకున్నారు.

యాక్షన్ వార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ అమితంగా ఎదురుచూస్తున్నారు. డిస్ని + హాట్ స్టార్ ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆగస్ట్ 13న లేదా ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సల్మాన్, అజయ్ దేవగన్ లాంటి హీరోలే ఓటీటీ పై ఇంట్రెస్ట్ చూపడంతో అదే బాటలో కొంతమంది మీడియం హీరోల సినిమాలు కూడా ఓటీటీ డీల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











