అబ్బాయిలతో అలా నైట్ క్లబ్ లో స్టార్ హీరో కూతురు.. రెచ్చిపోయిందిగా.. ఫొటోస్ వైరల్!

సినిమా ప్రపంచంలో స్టార్ సెలబ్రెటీల పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పెద్దయ్యాక మాత్రం వారిని గుర్తు పట్టడం అంత ఈజి కాదు. గతంలో అయితే స్టార్ హీరోలు వారి పిల్లల్ని సినిమా ప్రపంచానికి కాస్త దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పటి తరం పిల్లలు తల్లి దండ్రుల అనుమతి అవసరం లేదని యథేచ్ఛగా ఫ్యాషన్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో కూతురు కూడా పార్టీ ఫోటోలతో షాక్ ఇస్తోంది. ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

అజయ్ ఫ్యామిలీ

అజయ్ ఫ్యామిలీ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అజయ్ దేవగన్ ఒకప్పటి గ్లామర్ బ్యూటీ కాజోల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరికి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు. కుమార్తె నైసా దేవగన్ ఇటీవల 19 ఏళ్ల వసంతంలోకి అడుగు పెట్టింది. ఇక కొడుకు యుగ్ దేవగణ్ టీనేజ్ లోనే ఉన్నాడు.

దేవగన్ డాటర్

దేవగన్ డాటర్

ఇక అజయ్ దేవగన్ సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ హీరోగా తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నాడు. ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఉంటాయి. అజయ్ దేవగన్ కూతురు కు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

గ్లామరస్ అందాలతో..

గ్లామరస్ అందాలతో..

అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ ఫ్యాషన్ ప్రపంచంలో అయితే మునిగి తేలుతున్నట్లు గా తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 20వ తేదీన ఆమె 19 లోకి అడుగు పెట్టడంతో తన స్వేచ్ఛా ప్రపంచంలోకి మరింత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు గా ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూస్తేనే అర్థమవుతుంది. నిత్యం పార్టీలకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆమె షేర్ చేసుకుంటోంది. ఇక ప్రతి ఫోటోలో తన గ్లామర్ను కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

 నైట్ పార్టీలో ఎంజాయ్

నైట్ పార్టీలో ఎంజాయ్

రీసెంట్ గా నైసా ఒక స్పెషల్ పార్టీలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అజయ్ దేవగన్ కూతురు గ్లామర్ విషయంలో కూడా తల్లిని మించి పోతున్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా ఎంట్రీ చాలా ఉంది అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

స్నేహితులతో కలిసి..

స్నేహితులతో కలిసి..

నైసా దేవగన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణి అలాగే ఇతరులతో కలిసి లండన్‌లోని అరేనాలో నైట్ పార్టీ చేసుకుంటూ కనిపించింది. పార్టీ ఫోటోలలో నైసా దేవగన్‌తో పాటు అర్జున్ రాంపాల్ కుమార్తె మహికా రాంపాల్ కూడా కనిపిస్తుంది. వీరు ఇద్దరు కూడా చాలా ఏళ్ళుగా స్నేహితులుగా కొనసాగుతున్నారు.

అక్కడ చదువుకుంటున్న నైసా

అక్కడ చదువుకుంటున్న నైసా

ఇదిలా ఉంటే నైసా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లోని గ్లియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌న్ లో ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ గురించి కోర్స్ చేస్తోంది. నైసా, ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్ 2022కి హాజరైన తర్వాత మీడియాలో కూడా ఫోకస్ అయ్యింది. అక్కడ ఆమె మనీష్ మల్హోత్రా యొక్క కలెక్షన్ ఫ్యాషన్ స్టైల్ తో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరి ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X