వర్మ కన్నా ముందే కర్చీఫ్ వేసిన అజయ్... గాల్వన్ లోయపై ఘటనపై సినిమా

దేశంలో చోటుచేసుకున్నఅసాధారణ ఘటనలపై హుటాహుటిన సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పటివరకూ గాల్వన్ లోయ ఘటనపై ఎలాంటి చప్పుడూ చేయకపోయేసరికి, ఆ లోటు భర్తీ చేసేందుకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నడుంబిగించాడు. దేశాన్ని కుదిపేసిన గాల్వన్ లోయ ఘటనపై సినిమా నిర్మించేందుకు సమాయత్తం అయ్యాడు.

దేశ సరిహద్దులో భారత్ -చైనా నడుమ చోటుచేసుకున్న సంఘర్షణలో భారత్ కు చెందిన జవానులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు తెరరూపం ఇచ్చేందుకు అజయ్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. సినిమా టైటిల్, ఇతర తారాగణం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అజయ్ దేవగణ్ ఫిల్మ్స్, సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి

Ajay Devgan to produce a Film on Galwan valley clash

ప్రస్తుతం అజయ్ దేవగణ్ మరో వార్ ఫ్మిల్మ్ భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఓ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ పై త్వరలోనే విడుదల కానుంది. అభిషేక్ దుడైయ్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1917లో భారత్ పాక్ నడుమ జరిగిన యుద్ధం ఆధారితంగా తెరకెక్కింది. సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, నోరా ఫతేహీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో భుజ్ విమానాశ్రయ అధికారి అయిన స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో అజయ్ కనిపించబోతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X