మ్యారేజ్ డేట్ తప్పుగా చెప్పిన భర్త.. బోరున ఏడ్చేసిన స్టార్ హీరోయిన్!
Recommended Video

అగ్ర నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్య్వవహరిస్తున కాఫీ విత్ కరణ్ షో రోజు రోజుకూ పాపులర్ అవుతోంది. వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది. మంచి క్రేజీ ఉన్న సెలెబ్రిటీలని గెస్ట్ లుగా తీసుకుని వచ్చి వినోదాత్మకంగా షోని నిర్వహిస్తున్నారు. జాన్వీ, అర్జున్ కపూర్.. సైఫ్ అలీఖాన్, సారా.. ఇలా పాపులర్ సెలెబ్రిటీలు కాఫీ విత్ కారం షో కు హాజరవుతున్నారు. తాజాగా ఈ షోకు బాలీవుడ్ రొమాంటిక్ జంట అజయ్ దేవగన్, కాజోల్ దంపతులు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో తాజగా విడుదల చేశారు. ఎపిసోడ్ మొత్తం చాలా వినోదాత్మకంగా సాగినట్లు తెలుస్తోంది.

ఆమెకు మూడు గంటలు పడుతుంది
ఈ షో మొత్తం అజయ్ దేవగన్ తన భార్య కాజోల్ ని టీజ్ చేస్తూ కనిపించాడు. ఇంస్టాగ్రామ్లో ఒక ఫోటో పోస్ట్ చేయడానికికాజోల్ కు మూడుగంటల సమయం పడుతుంది. ఈ వ్యాఖ్యలతో కరణ్ జోహార్ ఆశ్చర్యపోయాడు. అసలు ఈ ఫోటో అందంగా ఉందా లేదా.. ఎలాంటి ఫోటో షేర్ చేయాలి అని ఆలోచించడానికే మూడు గంటల సమయం తీసుకుంటుందని సరదాగా వ్యాఖ్యానించాడు.

ముసలిదైపోయింది
ఆడవాళ్ళని ఏమన్నా పడతారు కానీ.. వాళ్ళ అందాన్ని కించపరిస్తే ఊరుకోరు అనే విషయం కాజోల్ మరోమారు రుజువు చేసింది. తన భార్య బాగా ముసలిదైపోయిందంటూ కామెంట్ చేశాడు. దీనితో కాజల్ వైపు నుంచి వెంటనే రియాక్షన్ వచ్చేసింది. నేనేం కాదు నువ్వే ముసలాడివి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇంతటితో ఈ టీజింగ్ వ్యవహారం ఆగలేదు.

ఆమె మాట్లాడితే వింటావా
కరణ్ జోహార్ అజయ్ దేవగన్ ని అడుగుతూ.. కాజోల్ ఏదైనా మాట్లాడితే నువ్వు వినాల్సిందే కదా అని అడిగాడు. దీనికి అజయ్ దేవగన్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ఆమె మాట్లాడుతూనే ఉంటుంది.. కానీ నేను వినను అని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో ఎవరు కాజోల్ పక్కన బావుంటారు అని కరణ్ జోహార్ అడగగా.. కొడుకుగానా అంటూ అజయ్ దేవగన్ చిలిపిగా సమాధానం ఇచ్చాడు. మరోమారు కాజోల్ అతడి వంక కోపంగా చూసింది.

బోరున ఏడుపు
మీ పెళ్లి రోజు ఎప్పుడు అని కరణ్ అజయ్ దేవగన్ ని అడిగాడు. అజయ్ దేవగన్ కు మ్యారేజ్ డేట్ గుర్తున్నట్లు లేదు. ఇష్టం వచ్చిన డేట్లన్నీ చెప్పసాగాడు. కనీసం పెళ్లిరోజు కూడా గుర్తులేదా అని కాజోల్ బోరున ఏడ్చేసింది. మా పెళ్లి రోజు 1999 ఫిబ్రవరి 24 అంటూ ఏడుస్తూనే సమాధానం ఇచ్చింది. ఇదంతా చాలా సరదాగా జరిగింది. ఈ షోలో కాజోల్ హావ భావాలూ చూస్తే నవ్వు ఆపుకోలేరు.


Click it and Unblock the Notifications











