క్రేజీ ప్రాజెక్ట్ రెడీ.. అజయ్ దేవగణ్ డైరెక్షన్‌లో అమితాబ్
ప్రస్తుతం అజయ్ దేవగణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటు ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాదిలో మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. చివరగా తాన్హాజీ అని వెండితెరపై విజృంభించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం అజయ్ దేవగణ్ భుజ్, మైదాన్ చిత్రాలతో హల్చల్ చేస్తున్నాడు. తాజాగా అజయ్ దేవగణ్ కొత్త సినిమా ప్రకటన ఒకటి వచ్చింది. ఈ సినిమాను స్వయంగా నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబోలో దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ ఓ చిత్రం రాబోతోంది. అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటించబోతోన్న ఈ మూవీలో అమితాబ్ కీలక పాత్రను పోషించనున్నాడట. ఈ మూవీ టైటిల్ మేడేగా నిర్ణయిచారు. ఈ మూవీ డిసెంబర్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అజయ్ దేవగణ్ యు మీ ఔర్ హమ్ అనే చిత్రంతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం అమితాబ్ కేబీసీ 12వ సీజన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇలా ఇద్దరూ కలిసి మళ్లీ పని చేయబోతోండటంతో బాలీవుడ్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతోన్నారు. వీరిద్దరి కాంబోలో ఇదివరకు మేజర్ సాబ్, ఖాఖీ, సత్య గ్రహ వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. మేడే చిత్రంలో ఎమోషన్స్‌తో కూడుకున్న కాన్సెప్ట్‌తో ఉంటుందని ఇందులో అజయ్ దేవగణ్ పైలెట్‌గా నటించబోతోన్నాడట. అయితే అమితాబ్ పాత్రకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications











