కనీసం అది కూడా తెలీదా.. ఆ విషయంలో అజయ్ దేవగణ్ పరువు గోవిందా..!!
బాలీవుడ్ క్యూట్ కపుల్ అజయ్ దేవగణ్, కాజల్ ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. సినీ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ వీరి అన్యోన్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసే అల్లరికి ఫాలోవర్స్ ఫిదా అవుతూ ఉంటారు. ఇలా ఈ ఇద్దరు చేసిన ఓ పని అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. పొరపాటున భార్య కాజల్ నంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశాడు.

పొరపాటున భార్య నంబర్..
అజయ్ దేవగణ్ పొరపాటున తన భార్య కాజోల్ నంబరును ట్విట్టర్ లో షేర్ చేశాడు. , కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదంటూ.. ఆమె వాట్సప్ నంబర్‌ను షేర్ చేశాడు. అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ ని, అందరికీ కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు అజయ్ దేవగణ్. అంతే, ఆ ట్వీట్ వైరల్ అయింది. వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం ప్రారంభించారు.

అంతలోనే సర్దుకున్న హీరో..
అజయ్ దేవగణ్ జరిగిన తప్పును తెలుసుకుని.. ఆ ట్వీట్ ను డిలీట్ చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆపై మరో ట్వీట్ లో ఇది 'ప్రాంక్' అని చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. మీరు చేస్తున్న ప్రాంక్స్ స్టూడియోను దాటి వెళ్లాయ్. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవంటూ భర్తకు వార్నింగ్ ఇచ్చింది కాజోల్.
మరోసారి కాజోల్ చేతికి అజయ్..
మరోసారి కాజోల్ చేతికి అజయ్ చిక్కాడు. ఓ సెల్ఫీ తీసుకుందామని భర్తను ప్రేమగా కాజోల్ అడగ్గా అతను చేసిన పని చూస్తే అందరూ నవ్వుకోవాల్సిందే. కనీసం ఈ విషయం కూడా తెలీదా అని అనుకోవాల్సిందే. ఇంతకీ ఏం జరిగిందో కాజల్ మాటల్లోనే చూద్దాం.
Recommended Video


సెల్ఫీ అంటే అర్థం అది..
కాజోల్ మెట్లపై కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. దాని వెనుకున్న కథను చెప్పుకొచ్చింది. ‘బేబీ ఓ సెల్ఫీ తీసుకుందామా..?' అని కాజోల్ అడిగితే.. ‘ఓ ఒకే వెళ్లి అక్కడ కూర్చో నేను తీస్తాను' అని అజయ్ అన్నాడట. ‘సెల్ఫీ అంటే ఇద్దరం ఉండాలి.. ఫోటో తీసేవారు కూడా ఉండాలి' అని అనడంతోనే నాలుక కరుచుకున్నాడనే అర్థం వచ్చేట్టు ఓ ఎమోజీని షేర్ చేసింది.
వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తాన్హాజీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అజయ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











