అప్పట్లో సినిమా ప్లాప్ చేయడానికి కుట్ర... ఆ ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారా?

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మధ్య 2016లో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. కరణ్ రూపొందించిన 'యే దిల్ హై ముష్కిల్'... అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన 'శివాయ్' చిత్రాలు ఒకేసారి విడుదలై బాక్సాఫీసు వద్ద క్లాష్ అయ్యాయి.

అయితే అప్పట్లో కరణ్ జోహార్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. తన సినిమాకు అడ్డుగా ఉన్న 'శివాయ్' చిత్రంపై అతడు డబ్బులు పెట్టి మరీ నెగెటివ్ ప్రచారం చేశారని పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విరోధం పెరిగింది.

25 లక్షలతో కుట్ర అంటూ అజయ్ దేవగన్ ఆరోపణలు

25 లక్షలతో కుట్ర అంటూ అజయ్ దేవగన్ ఆరోపణలు

ఆ సమయంలో బాలీవుడ్ క్రిటిక్ కమాల్ రషీద్ ఖాన్ ‘శివాయ్' చిత్రంపై నెగెటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేశాడు, అదే సమయంలో ‘యే దిల్ హై ముష్కిల్' పై ప్రశంసలు గుప్పించారు. దీంతో కరణ్ జోహారే అతడికి రూ. 25 లక్షలు డబ్బులు ఇచ్చి ఇలా నెగెటివ్ ప్రచారం చేయించాడనే అనుమానం అజయ్ దేవగన్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కాజోల్ ట్వీట్ చేయడంతో షాక్

కాజోల్ ట్వీట్ చేయడంతో షాక్

అజయ్ దేవగన్ భార్య కాజోల్, కరణ్ జోహార్ మధ్య మంచి స్నేహం ఉండేది. వీరి కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ చేసిన ఆరోపణలను కాజోల్ సమర్దిస్తూ రిట్వీట్ చేయడం కూడా కరణ్‌కు షాకిచ్చినట్లయింది. దీంతో ఆమెతో ఉన్న స్నేహాన్ని కూడా కరణ్ తెంచుకున్నాడనే వార్తలు వచ్చాయి.

కాజోల్‌తో గొడవ లేదు

కాజోల్‌తో గొడవ లేదు

కాజోల్‌తో స్నేహం తెంచుకున్నట్లు వచ్చిన వార్తలను కరణ్ జోహార్ అప్పట్లోనే ఖండించారు. సమస్య నాకు, అజయ్ దేవగన్ మధ్య మాత్రమే.... నాకు కాజోల్ మధ్య కాదు అంటూ వివరణ ఇచ్చారు కూడా.

మళ్లీ వీరు కలుస్తున్నారా?

మళ్లీ వీరు కలుస్తున్నారా?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య రాజీ కుదురుతున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలింస్ స్టూడియోలో ఇటీవల కరణ్, అజయ్ కలిసాశారట. వచ్చే దీపావళికి ఇద్దరి నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X