అజయ్ దేవగన్ పిచ్చిపని.. యువతి ఆత్మహత్యాయత్నం.. ఏం జరిగిందంటే..
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అంటే తెరమీద చాలా హుందాగా కనిపిస్తారు. కానీ ఒకసారి కెమెరా ముందు నుంచి వాస్తవ జీవితంలోకి వచ్చాడంటే మాత్రం చిలిపిగా వ్యవహరిస్తుంటారు. తోటి నటీనటులను, సన్నిహితులను ఆటపట్టించడం చాలా సరదా. అయితే తన అలవాటు ప్రకారం తాను చిలిపిగా ఆటపట్టించడంతో తోటి ఆర్టిస్టు భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే విషయాన్ని తాజాగా వెల్లడించారు.

రైడ్ సినిమా ప్రమోషన్‌లో
అజయ్ దేవగన్ నటించిన తాజా చిత్రం రైడ్. ఈ సినిమా మార్చి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన చిత్రంలో ఇలియానా డీ క్రజ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. రైడ్ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్‌లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తన కారణంగా స్నేహితుడి భార్య సూసైడ్‌కు ప్రయత్నించిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

అవుట్ డోర్ షూటింగ్‌లో
నా తోటి నటుడు కొత్తగా పెళ్లి చేసుకొన్నాడు. అతడి భార్య సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని సాధారణ యువతి. అయితే రాత్రిపూట చాలా రోజులు అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుంటే సెట్‌కు తీసుకొచ్చారు.

నా స్నేహితుడి భార్యను
ఆ సినిమా షూటింగ్ సందర్భంగా నా స్నేహితుడి భార్యతో పరిచయం జరిగింది. అలా క్లోజ్ కాగానే ఆమెను ఆటపట్టించడం ప్రారంభించాను. నీ భర్తకు మరో యువతితో అఫైర్ ఉంది అని అబద్ధాలు చెప్పడం ప్రారంభించాం. రోజు అలా అఫైర్ గురించి చెబుతుంటే నిజమే అని నమ్మింది.

నిద్రమాత్రలు మింగి
నేను చెప్పిన మాటలు దాదాపు ఎనిమిది రోజులు విన్నారు. తొమ్మిదో రోజు నేను చెప్పిన విషయం నమ్మింది. మరో యువతితో అఫైర్ ఉందా అనే విషయంపై వారిద్దరు గొడవపడ్డారు. ఆ గొడవ కారణంగా మనస్తాపం చెందిన నా స్నేహితుడి భార్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

హాస్పిటల్‌కు తరలించడంతో
తన భార్య అపస్మారక స్థితిలో ఉండటం చేసి అనుమానం వచ్చిన నా స్నేహితుడు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స చేయడంతో ప్రాణగండం తప్పింది అని అజయ్ దేవగన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











