విషాదంలో అజయ్ దేవగన్, కాజల్... ప్రముఖ స్టంట్ మాస్టర్ కన్నుమూత

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్స్ మాస్టర్ వీరు దేవగన్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వీరు దేవగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వీరు దేవగన్ మృతివార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరు మరణంపై బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటున్నారు. వివరాల్లోకి వెళితే

 వీరు దేవగన్ ఇక లేరు

వీరు దేవగన్ ఇక లేరు

వీరు దేవగన్ ఇక లేరు అనే విషయం మమల్ని దుఖ:సాగరంలో ముంచేసింది. ఆయన మరణించారనే విషయాన్ని తెలియజేయడానికి విషాదంలో మునిగిపయాం. సోమవారం ఉదయం శాంతా క్రజ్‌లోని సూర్య హాస్పిటల్‌లో ఆయన మరణించారు. సోమవారం సాయంత్రం విల్లే పార్లేలోని పశ్చిమ శ్మశాన వాటికలో 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తాం అని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వృద్దాప్య సంబంధిత వ్యాధితో

వృద్దాప్య సంబంధిత వ్యాధితో

కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం తీవ్రతరం కావడంతో వీరు దేవగన్ కోలుకోలేకపోయారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషాదంలో కూరుకుపోయిన కాజల్, అజయ్ దేవగన్‌కు స్నేహితులు, సన్నిహితులు సహకారం అందిస్తున్నారు అని కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

 స్టంట్ మాస్టర్‌గా వీరు

స్టంట్ మాస్టర్‌గా వీరు

80వ దశకంలో వీరు దేవగన్ ప్రముఖ యాక్షన్ మాస్టర్‌గా రాణించారు. జితేంద్ర నటించిన హిమ్మత్ వాలా, అనిల్ కపూర్ నటించిన మిస్టర్ ఇండియా, అజయ్ దేవగన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన పూల్ ఔర్ కాంటే, అమితాబ్ నటించిన లాల్ బాద్షా, షాహెన్షా, ఇష్క్, ఖూన్ బరీ మాంగ్, మిస్టర్ నట్వర్ లాల్ చిత్రాలకు ఆయన యాక్షన్ కొరియోగ్రఫి చేశారు.

 దర్శకుడిగా వీరు దేవగన్

దర్శకుడిగా వీరు దేవగన్

బిగ్ బీ అమితాబ్‌కు వీరు దేవగన్ అత్యంత సన్నిహితుడు. అలాగే హిందూస్తాన్ కి కసమ్ అనే సినిమాకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, అమితాబ్, మనీసా కోయిరాలా, సుస్మిత సేన్ తదితరులు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణ పొందలేదు. చివరిసారిగా అజయ్ దేవగన్ నటించిన టోటల్ ఢమాల్ అనే సినిమా స్క్రీనింగ్ సందర్భంగా మీడియాకు కనిపించారు.

వికీ కౌశల్ తండ్రి సంతాపం

వికీ కౌశల్ తండ్రి సంతాపం

వీరు దేవగన్ మృతిపై బాలీవుడ్ హీరో వికి కౌశల్ తండ్రి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌశల్ స్పందించారు. వీరు దేవగన్ ఆత్మకు శాంతి కలుగాలి. ఈ విషాద వార్త తెలియడంతో మానసికంగా కుంగిపోయాను. గొప్ప యాక్షన్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న మనిషి. ఆయన ఆశీస్సుల వల్లేన ేను యాక్షన్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. నేను స్టంట్ మాస్టర్ కావడానికి కావాల్సిన అప్లికేషన్‌పై ఆయనే స్వయంగా సంతకం చేశారు అని షాయ్ కౌశల్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X