twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజయ్ దేవగన్‌కు రైతుల సెగ.. కారును అడ్డగించి..

    |

    బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు రైతుల సెగ తగిలింది. ఆయన కారును రైతులు కొందరు అడ్డుకొన్నారు. ఈ ఘటన ముంబైకి సమీపంలో జరిగింది. అయితే కొద్ది రోజుల ముందు రైతుల ఉద్యమానికి సపోర్టుగా ఇంటర్నేషనల్ స్టార్ రిహన్నా చేసిన ట్వీట్ గందరగోళం సృష్టించింది.

    ఆ క్రమంలో అజయ్ దేవగన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇండియా గురించి తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అందర్నీ సమైక్యం ఉండాల్సిన సమయంలో ఇలా విభేదాలు సృష్టించే విధంగా ట్వీట్లు చేయవద్దు అంటూ అజయ్ దేవగన్ పరోక్షంగా రిహాన్నాను ఉద్దేశించి ట్వీట్ చేయడం తెలిసిందే.

    Ajay Devgn stopped at mumbai by Farmers

    మంగళవారం అజయ్ దేవగన్ కారును ముంబైకి సమీపంలోని గోరేగావ్ వద్ద కొందరు అడ్డుకొన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ నిలదీశారు. అజయ్ దేవగన్‌ను అడ్డుకొన్న వ్యక్తిని రాజ్‌దీప్‌ సింగ్‌గా గుర్తించారు. దాదాప 15 నిమిషాల పాటు కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నట్టు ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఆ వీడియోలో రాజ్‌దీప్ తన చేతి వేలిని అజయ్‌ దేవగణ్‌పై ముఖంపై పెట్టి మాట్లాడటం కనిపించింది. ఈ ఘటన అనంతరం రాజ్‌దీప్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

    అయితే ఈ సంఘటనపై అజయ్ దేవగన్‌ ఏ విధంగా కూడా స్పందించకపోవడం గమనార్హం.

    ఇక అజయ్ దేవగన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం RRR చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు బాలీవుడ్ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

    English summary
    Bollywood actor Ajay Devgn was stopped at mumbai by Farmers. While he was travelling in car, Farmers stopped at Goregaon. Ajay tweeted on farmers protest that, Don’t fall for any false propaganda against India or Indian policies. Its important to stand united at this hour w/o any infighting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X