ప్రభాస్ ‘ఆదిపురుష్’లో మరో స్టార్ హీరో: శివుడిగా కనిపించనున్న ‘RRR’ గురువు

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకుని.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. చారిత్రక చిత్రాల దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో అతడు 'ఆదిపురుష్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ.. ముంబై నగరం శివారులోని మధ ద్వీపం దగ్గర వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ లేని సీన్లను ప్రస్తుతానికి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ బీ టౌన్ ఏరియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్'లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడట. అదే.. శివుడి పాత్ర అని సమాచారం. కేవలం ఓ ఐదు నిమిషాలు మాత్రమే కనిపించనున్న ఈ రోల్ కోసం ఆయనను దర్శకుడు సంప్రదించగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణ బ్రహ్మగానూ నటిస్తున్నారు. వీళ్లతో పాటు కృతి సనన్ సీత పాత్రలోనూ యంగ్ హీరో సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ చేస్తున్నారు. ఈ మూవీలో రావణ - శివుడి పాత్రలను హైలైట్ చేస్తారని సమాచారం.

కసరత్తుల పేరుతో మలైకా అరోరా గ్లామర్ షో.. పొట్టి దుస్తుల్లో మరింత బోల్డ్‌గా

Ajay Devgn to play Lord Shiva Role In Prabhass Adipurush

అజయ్ దేవగణ్ ప్రస్తుతం పలు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో కీలకమైన గురువు పాత్రను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్'ను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తీస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణంలో ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X