నాకు ఎవరు లవర్స్ లేరు.. నాకు నేనే.. స్టార్ హీరోకు భార్య షాక్
జస్ట్ కొన్ని రోజులు కితమే ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు అంతా తమ వాలెంటైన్స్ తో కలిసి వాలెంటైన్ డే చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా పలు సినిమాలు కూడా కొత్తవి, పాతవి కూడా వచ్చాయి. కాగా వీటితో పాటుగా అనేకమంది సినీ హీరో అండ్ హీరోయిన్స్ జంటలు కూడా తమ బెస్ట్ హాఫ్ లకి వాలెంటైన్స్ డే విషెస్ ని చెప్పుకున్నారు. కాగా ఇందులో మన తెలుగు నుంచి సహా పాన్ ఇండియా సినీ ప్రముఖులు కూడా విష్ చేసుకున్నారు.
అయితే వీరిలో మన తెలుగు సినిమా నుంచి పాన్ వరల్డ్ లెవెల్లో భారీ రీచ్ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. కాగా RRR సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ రామ్ చరణ్ లతో పాటుగా సినిమాలో అత్యంత కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

కాగా అజయ్ దేవగన్ హిందీ సినిమాలో మళ్ళీ ఫుల్ బిజీగా ఉండగా తన భార్య కూడా అక్కడ టాప్ స్టార్ ని అందరికీ తెలిసిందే. సీనియర్ నటి కాజోల్ ని తాను పెళ్లి చేసుకొని ఇన్నేళ్లు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసారు. కాగా ఇపుడు ఊహించని విధంగా ఈ వాలెంటైన్స్ డే కి అజయ్ నుంచి ఒక రకమైన పోస్ట్ వస్తే కాజోల్ నుంచి ఒక పోస్ట్ రావడం సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది.
కాగా వాలెంటైన్స్ డే సందర్భంగా తన వాలెంటైన్ కాజోల్ అంటూ తన భార్యతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ పోస్ట్ పెట్టి మరీ విష్ చేస్తే అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు. కానీ ఇందుకు భిన్నంగా కాజోల్ ఊహించని షాకిచ్చింది. తాను వాలెంటైన్స్ డే విష్ చేస్తూ నాకెవరూ ప్రేమికులు లేరు నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను నాకు నేనే వాలెంటైన్ అంటూ తనకి తానే ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాను అని చేసిన పోస్ట్ అజయ్ దేవగన్ అభిమానులని హర్ట్ చేసింది.
తన భర్త ఏమో తన భార్యకి ఎంతో విలువ ఇచ్చి పోస్ట్ చేస్తే కాజోల్ మాత్రం ఇలా చేస్తుందా అంటూ అజయ్ దేవగన్ ఫ్యాన్స్ సహా నెటిజన్స్ కూడా ఆమెపై మండిపడుతున్నారు. ఇలా భర్తకి గౌరవం, ప్రేమ చూపించని భార్యలు ఎవరికీ రాకూడదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈ ఇద్దరి జంట విరుద్ధ పోస్ట్ లు ఒకింత షాకింగ్ గా ఒకింత వైరల్ గా మారాయి.
మరి కాజోల్ ఏ ఉద్దేశంతో ఇలా చేసిందో కానీ పలు ప్రశ్నలు ఇపుడు లేవనెత్తుతున్నాయి. ఇక ప్రస్తుతం అజయ్ దేవగన్ హిందీలో అవైటెడ్ సీక్వెల్ సన్నాఫ్ సర్దార్ 2 చేస్తుండగా ఈ సినిమాలో తన సరసన మృణాల్ ఠాకూర్ రొమాన్స్ చేస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాదిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి మొదటి భాగాన్ని తెలుగు చిత్రం "మర్యాద రామన్న"కి రీమేక్ గా తెరకెక్కించగా దానికి సోలోగా హిందీ మేకర్స్ సీక్వెల్ ని ప్లాన్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











