బ్రహ్మస్త్ర సెట్లో అఖిల్.. కరణ్, రణ్‌బీర్‌తో కలిసి సెల్ఫీ!

By Rajababu

హిందీలో కరణ్ జోహర్ నిర్మాణ సారథ్యంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న బ్రహ్మస్త్ర సెట్లో అఖిల్ అక్కినేని ప్రత్యక్షమయ్యాడు. కరణ్ జోహర్, హీరో రణ్‌బీర్ కపూర్‌తో దిగిన సెల్ఫీని అఖిల్ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో నాగార్జున ఓ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కోసం అమలతో కలిసి నాగార్జున యూరప్ వెళ్లారు. యూరప్ పర్యటనలో ఉన్న తల్లిదండ్రులతో జాయిన్ అవ్వడానికి అఖిల్ అక్కడికి వెళ్లాడు. ఈ సందర్భంగా బ్రహ్మస్త్ర చిత్ర యూనిట్‌ను అఖిల్ కలిశాడు.

గతంలో శివ, క్రిమినల్, ఖుదాగవా లాంటి పలు చిత్రాల్లో నటించి హిందీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. నేను బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నాను. సుమారు 15 ఏళ్ల తర్వాత హిందీ చిత్రంలో నటించడం జరుగుతున్నది. చివరిగా నేనే ఏ బాలీవుడ్ చిత్రంలో నటించానో నాకే గుర్తు లేదు అని చెప్పారు.

Akhil Akkineni met karan johar, Ranbir Kapoor in Brahmastra sets

బ్రహ్మస్త్ర చిత్రం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రానికి యే జవానీ హై దివానీ చిత్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2019 ఆగస్టు 15న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X