twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడ్డంగా దొరికిన అక్షయ్ కుమార్... తప్పు ఒప్పేసుకొని.. పన్నులు కడుతున్నాగా?

    |

    బాలీవుడ్ అక్షయ్ కుమార్ అడ్డంగా బుక్కయ్యాడు. కెనడా పాస్‌పోర్ట్‌తో దేశంలో ఉంటున్న ఈ యాక్షన్ హీరో తప్పు ఒప్పేసుకొన్నాడు. నాకు కెనడియన్ పాస్‌పోర్ట్ ఉందని, భారతీయ పౌరసత్వం లేదని అంగీకరించాడు. ఈ అంశం ప్రస్తుతం వివాదంగా మారింది. ముంబైలో ఓటు హక్కు వినియోగించుకోలేదని వ్యవహారం రచ్చగా మారిన నేపథ్యంలో అక్షయ్ కుమార్ స్పందించారు. దీనిపై అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. తన కెనడియన్ పాస్‌పోర్ట్‌పై వివరణ ఇచ్చాడు. మోదీతో ఇంటర్వ్యూ తర్వాత ఈ వివాదానికి రంగు పులుముకోవడం గమనార్హం. ఆయన ఏమన్నారంటే...

     ఓటు హక్కు వ్యవహారంతో బయటకు

    ఓటు హక్కు వ్యవహారంతో బయటకు

    ముంబైలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాలీవుడ్ ప్రముఖులందరూ క్యూలో నిలబడి ఓటేశారు. అయితే అక్షయ్ కుమార్ ఎక్కడా కనిపించకపోవడంతో ఆరా తీయగా.. ఓటు హక్కుకు దూరంగా ఉన్నారనే విషయం వెల్లడైంది. దాంతో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడానికి కారణం కెనడా పౌరుడు అనే విషయం బయటకు పొక్కింది.

     కెనడా పాస్ట్‌పోర్ట్ ఉందనే విషయం

    కెనడా పాస్ట్‌పోర్ట్ ఉందనే విషయం

    నాకు కెనడా పాస్ట్‌పోర్ట్ ఉందనే విషయాన్ని నేను ఎప్పుడూ దాచలేదు. లేదని అబద్ధం చెప్పలేదు. నేను ఇండియాలో పనిచేస్తున్నాను. అందుకు దేశంలోనే పన్నులు చెల్లిస్తున్నాను అని చెప్పాడు. ముంబైలో ఓటు హక్కు వినియోగించుకోలేదని వచ్చిన విమర్శలకు తగిన సమాధానం ట్విట్టర్‌లో వెల్లడించారు.

    నా పౌరసత్వంపై ఎందుకు రాద్దాంతం

    నా పౌరసత్వంపై ఎందుకు రాద్దాంతం

    నా పౌరసత్వం అంశాన్ని మీడియాలోకి లాగి అనవసరంగా వివాదంగా మలిచారు. నా పౌరసత్వం మీద ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు. నేను పాస్‌పోర్ట్ అంశాన్ని ఎప్పుడూ దాచలేదు. గత ఏడేళ్లలో నేను ఎప్పుడు కెనడాను సందర్శించలేదు అని అక్షయ్ కుమార్ వివరణ ఇచ్చారు. కాగా తాజా ఎన్నికల్లో ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఓటు హక్కును ఉపయోగించుకోవడం గమనార్హం.

     భారత్ అంటే నాకు అమితమైన గౌరవం

    భారత్ అంటే నాకు అమితమైన గౌరవం

    ఇన్నేళ్లుగా దేశంలో ఉంటున్నా.. నేను భారతీయుడు అని రుజువు చేసుకోవాల్సిన అవసరం రాలేదు. నా పౌరసత్వం అంశాన్ని అనవసరంగా వివాదంగా మార్చడం నాకు నిరాశను కలిగిస్తున్నది. ఈ అంశం వ్యక్తిగతంగా, చట్టపరంగా నాకే సంబంధించింది. ఇప్పటికీ నేను దేశం అంటే అమితమైన గౌరవం. మేకిన్ ఇండియాను బలంగా నమ్ముతాను అని అక్షయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

    English summary
    Akshay Kumar has clarified on Twitter had he holds a Canadian passport. But the 51-year-old actor added that he works in India and pays taxes in India. He said, "I really don't understand the unwarranted interest and negativity about my citizenship.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X