పిడి గుద్దులతో రెచ్చిపోయిన హీరో, దర్శకుడు.. కారణమేంటంటే..?

సినీ ప్రపంచంలో గాసిప్ అనేది సర్వ సాధారణం. అయితే అందులో కొన్ని మరీ వ్యక్తిగతంగా కించపరిచేవీ ఉంటాయి.. సరదాగా నవ్వుకుని వదిలేసేవీ ఉంటాయి. ప్రస్తుత సమయానికి కొన్ని గాసిప్స్‌గా చెలామణి అయినా.. భవిష్యత్తులో వాస్తవాలుగా రూపుదిద్దుకుంటాయి. అలా ఓ హీరో, దర్శకుడిపై వచ్చిన రూమర్‌ను నిజం చేసేందుకు వారిద్దరు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టిల మధ్య గొడవలు..

అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టిల మధ్య గొడవలు..

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్ .. కత్రినా కైఫ్ తో 'సూర్యవంశి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ ఈ సినిమా గురించి ఒక వార్త రాసింది. అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ ఎడమొహం పెడమొహం గా ఉంటే నిర్మాత కరణ్ జోహార్ మధ్య వర్తిత్వం వహించి సర్దుబాటు చేశారనేది ఆ వార్త సారాంశం.

ఫన్నీగా రిప్లై ఇచ్చిన టీమ్..

ఫన్నీగా రిప్లై ఇచ్చిన టీమ్..

దీంతో 'సూర్యవంశి' టీమ్ చిరాకు పడ్డారేమో కానీ ఒక వీడియో షూట్ చేశారు. ఆ వీడియోను అక్షయ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "#బ్రేకింగ్ న్యూస్- ఈ గొడవ మీ రోజు ను సరదా గా మారుస్తుంది" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

సరదాగా నటించిన హీరో, దర్శకుడు

ఈ వీడియో లో మొదట కత్రినా తన ఫోన్ లో ఆ గాసిప్ ను చూపిస్తుంది. ఆ తర్వాత అక్షయ్.. రోహిత్ ఇద్దరూ ఒకరిపై ఒకరు కోపం తో పిడి గుద్దులు కురిపించుకుంటారు. అప్పుడు ముంబై పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇద్దరి నీ పక్క కు లాగుతారు. ఇక ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే సదరు ఆర్టికల్ లో 'ఫాలౌట్' అనే ఇంగ్లీష్ పదాన్ని వాడారు... దానికి కూడా కౌంటర్ అన్నట్టుగా అక్షయ్.. రోహిత్ ఫైట్ లో భాగంగా నేల మీద పడిపోయినట్టు నటించారు.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
స్పందించిన కరణ్ జోహార్..

స్పందించిన కరణ్ జోహార్..

అలా వారిద్దరు ఒకరినొకరిపై పిడి గుద్దులు కురిపించుకుంటోన్న వీడియోకు రిప్లై ఇస్తూ.. ఇలాంటి గొడవలను నేనైతే పరిష్కరించలేను అంటూ సరదగా స్పందించాడు. అక్షయ్ షేర్ చేసిన ఈ వీడియోకు బాలీవుడ్ సెలబ్రిటీ ల నుంచి అద్భుత స్పందన దక్కుతోంది. వరుణ్ ధావన్.. కృతి సనన్.. టైగర్ ష్రాఫ్.. పూజా హెగ్డే, రాయ్ లక్ష్మీ లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టారు. ఇప్పటికే ఈ వీడియోను పదిహేను లక్షల మందికిపైగా వీక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X