సింధు బయోపిక్‌లో కోచ్ పాత్రలో అక్షయ్? పుల్లెల గోపిచంద్ రియాక్షన్ ఇదీ..

బిడబ్ల్యుఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాను ఓడించి తెలుగు తేజం పివి సింధు స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. సింధు ఈ అద్భుతమైన విజయం సాధించిన వెంటనే, ఆమెపై త్వరలో బయోపిక్ రాబోతోందనే న్యూస్ హాట్ టాపిక్ అయింది. ఇందులో కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రకు అక్షయ్ కుమార్‌తో చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ వార్తల విషయమై ఓ ఆంగ్లపత్రిక సింధు కోచ్ పుల్లెల గోపిచంద్‌ను ప్రశ్నించగా... "అక్షయ్ కుమార్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఒక వేళ ఆ పాత్ర ఆయన చేస్తే అద్భుతంగా ఉంటుంది. నేను ఆరాధించే వ్యక్తులలో ఆయన ఒకరు. కానీ ఆ బయోపిక్ గురించి నాకు కచ్చితంగా తెలియదు . " అన్నారు. అక్షయ్ కుమార్ పలు సందర్భాల్లో సింధును కలిశారని, ఆమెను ప్రోత్సహించారని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

పుల్లెల గోపీచంద్

పుల్లెల గోపీచంద్

పుల్లెల గోపిచంద్ భారత బ్యాడ్మింటన్ జట్టుకు ప్రధాన జాతీయ కోచ్. మాజీ ఆల్-ఇంగ్లాండ్ ఛాంపియన్, 1999 లో అర్జున అవార్డు, 2001 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009 లో ద్రోణాచార్య అవార్డు, 2014 లో పద్మ భూషణ్ (భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం) సహా పలు గౌరవాలు పొందారు.

అక్షయ్ కుమార్ ట్వీట్

అక్షయ్ కుమార్ ట్వీట్

సింధు చారిత్రాత్మక విజయం తరువాత, ఆమెను అభినందిస్తూ అక్షయ్ కుమార్ ట్విట్ చేశారు. " పివి సింధుకు హృదయపూర్వక అభినందనలు, డబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ 2019లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయురాలిగా అవతరించడం ఆనందంగా ఉంది' అని వ్యాఖ్యానించారు.

సింధు భావోద్వేగం

సింధు భావోద్వేగం

గెలుపు అనంతరం సింధు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. "నేను భారత జెండాను చూసినప్పుడు, జాతీయ గీతం ఆలపించినపుడు నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిన్నటి విజయం గురించిన భావాలను పదాల రూపంలో వ్యక్తపరచలేకపోతున్నాను. ఎంతో కాలం నుంచి ఈ విజయం కోసం ఎదురు చూశాను, ఇప్పటికి సాధ్యమైంది" అని పేర్కొన్నారు.

వారి వల్లే ఈ విజయం సాధ్యమైంది

వారి వల్లే ఈ విజయం సాధ్యమైంది

"నా తల్లిదండ్రులు, నా కోచ్‌లు (గోపి సర్. ఎంఎస్ కిమ్), నా ట్రైనర్ ( శ్రీకాంత్ వర్మ) మద్దతు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు. ముఖ్యంగా, నా స్పాన్సర్‌లకు, అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అందరి మద్దతు లభించింది, ఫైనల్లీ వరల్డ్ ఛాంపియన్ 2019, " అంటూ సింధు భావోద్వేగానికి లోనయ్యారు.

పివి సింధు బయోపిక్

పివి సింధు బయోపిక్

పివి సింధుపై మరో చిత్రం కూడా రెండేళ్లుగా చిత్రీకరణ దశలో ఉంది. పుల్లెల గోపిచంద్ పాత్రను పోషిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సోను సూద్. ఇపుడు అక్షయ్ కుమార్ కోచ్ గోపీచంద్ పాత్రలో మరో సినిమా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X