రేపిస్ట్‌కు, మాజీ సీఎంకు మధ్యవర్తిగా అక్షయ్ కుమార్.. తీవ్రమైన చిక్కులో హీరో, హైలెవల్‌లో!

బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ తీవ్రమైన చిక్కుల్లో ఇరుక్కున్నాడు. 2015, 2016 లో పంజాబ్ లో జరిగిన కొన్ని సంఘటనల్లో అతడి ప్రమేయంపై అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు చాలా కాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయంలో పంజాబ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ కు ఈ కేసుని అప్పగించింది. వెంటనే వాళ్ళు పని ప్రారంభించేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ సహా అక్షయ్ కుమార్ కూడా విచారణకు హాజరు కానున్నారు.

అపవిత్ర సంఘటనలు

అపవిత్ర సంఘటనలు

2015లో పంజాబ్ లోని ఫరీద్ కోట్ జిల్లాలో బుజ్ జవహర్ సింగ్ వాలా, భర్గారి గ్రామాల్లో కొన్ని అపవిత్ర సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలలో అక్షయ్ కుమార్, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, అతడి తనయుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

నవంబర్ 21న

నవంబర్ 21న

ఈ కేసులో విచారణని సిట్ వేగవంతం చేసింది. అక్షయ్ కుమార్ నవంబర్ 21న అమృత్ సర్ లో జరిగే విచారణ నిమిత్తం హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ప్రకాష్ సింగ్ బాదల్ విచారణ నవంబర్ 16న, సుఖ్ బీర్ సింగ్ విచారణ 19 న విడివిడిగా జరగనున్నాయి. ఈ కేసుకు సంబంధించి వీరి ముగ్గురి ప్రమేయం ఏంటనే కోణంలో విచారణ జరగనుంది.

రేపిస్ట్‌కు మధ్యవర్తిగా

రేపిస్ట్‌కు మధ్యవర్తిగా

డేరా బాబాగా తీవ్రమైన నేరాలకు పాల్పడిన గుర్మీత్ రామ్ రహీమ్ గుట్టు బట్టబయలైంది. గత ఏడాది అతడికి కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. పలువురిని దారుణంగా అత్యాచారం చేసిన కేసులో అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, డేరా బాబా కు అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం వహించాడనే ఆరోపణలు ఉన్నాయి.

 ఖండించిన అక్షయ్

ఖండించిన అక్షయ్

డేరా బాబాతో తాను సమావేశం అయినట్లు వచ్చిన వార్తలని అక్షయ్ కుమార్ అప్పట్లో ఖండించాడు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సిట్ ని హైలెవెల్ విచారణకు ఆదేశించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X