twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రాఫిక్ తప్పించుకునేందుకు మెట్రోలో అక్షయ్ కుమార్: ఎవరూ గుర్తుపట్టలేదే!

    |

    Recommended Video

    ట్రాఫిక్ తప్పించుకునేందుకు మెట్రోలో అక్షయ్ కుమార్: ఎవరూ గుర్తుపట్టలేదే!

    బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ తన సింప్లిసిటీని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, సాధారణ ప్రయాణికులతోపాటు మెట్రో రైల్లో ప్రయాణించారు. ముంబైలోని ఘాటాకోపర్‌లో జరుగుతున్న 'గుడ్ న్యూస్' సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు అక్షయ్.

    డైరెక్టర్ సలహాతో..

    డైరెక్టర్ సలహాతో..

    అయితే, అక్కడి నుంచి వెర్సోవా వెళ్లాల్సి వచ్చింది. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ పరిస్థితి పరిశీలిస్తే.. అతడున్న ప్రదేశం నుంచి చేరుకోవాల్సిన ప్రాంతానికి సుమారు 2గంటల సమయం పడుతుందని తెలిసింది. ఈ క్రమంలో ముంబైలో మెట్రోలో ప్రయాణించి అక్కడికి చేరుకుందామని అక్షయ్‌కి సలహా ఇచ్చారు సినిమా డైరెక్టర్.

    ఎవరూ గుర్తుపట్టలేదు..

    ఎవరూ గుర్తుపట్టలేదు..

    డైరెక్టర్ సూచన మేరకు మెట్రోలో ప్రయాణించారు అక్షయ్ కుమార్. ఇద్దరు బాడీగార్డులతోపాటు మెట్రో ఎక్కిన అక్షయ్ ఓ సీటు దొరకడంతో అక్కడ కూర్చున్నాడు. కాగా, క్లీన్ షేవ్‌తో అక్షయ్ కుమార్‌ను ప్రయాణికులు గుర్తుపట్టకపోవడం గమనార్హం. వర్షం పడుతుండగా మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ సరదాగా గడిపారు.

    రెండు గంటల ప్రయాణం 20నిమిషాల్లో..

    అంతేగాక, మెట్రోలో ప్రయాణిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల కోసం పోస్టు చేశారు. రెండు గంటలపాటు జరిగే తమ ప్రయాణాన్ని ఈ మెట్రో 20 నిమిషాలకు తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో అక్కీని కొనియాడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

    థ్యాంక్యూ అంటూ ముంబై మెట్రో..

    కాగా, భారీ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణించడంపై ముంబై మెట్రో కూడా స్పందించింది. ట్రావెల్ లైక్ బాస్ అంటూ ట్వీట్ చేసింది. మెట్రోలో ప్రయాణించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపింది.

    అక్షయ్ చేతిలో అరడజను సినిమాలు..

    అక్షయ్ చేతిలో అరడజను సినిమాలు..

    అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్' ఇటీవల విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన హౌస్‌ఫుల్ 4 త్వరలో విడుదల కానుంది. గుడ్‌న్యూస్ తోపాటు సూర్యవంశి, లక్ష్మీబాంబ్, పథ్వీరాజ్ లాంటి అరడజను సినిమాలు అక్షయ్ చేతిలో ఉన్నాయి.

    English summary
    From performing high octane stunts in his films to spreading awareness about grave issues and now travelling in Mumbai metro, Akshay Kumar is one Bollywood actor, who never ceases to surprise his fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X