Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్రాఫిక్ తప్పించుకునేందుకు మెట్రోలో అక్షయ్ కుమార్: ఎవరూ గుర్తుపట్టలేదే!
Recommended Video
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ తన సింప్లిసిటీని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా, సాధారణ ప్రయాణికులతోపాటు మెట్రో రైల్లో ప్రయాణించారు. ముంబైలోని ఘాటాకోపర్లో జరుగుతున్న 'గుడ్ న్యూస్' సినిమా షూటింగ్లో పాల్గొన్నారు అక్షయ్.
డైరెక్టర్ సలహాతో..
అయితే, అక్కడి నుంచి వెర్సోవా వెళ్లాల్సి వచ్చింది. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ పరిస్థితి పరిశీలిస్తే.. అతడున్న ప్రదేశం నుంచి చేరుకోవాల్సిన ప్రాంతానికి సుమారు 2గంటల సమయం పడుతుందని తెలిసింది. ఈ క్రమంలో ముంబైలో మెట్రోలో ప్రయాణించి అక్కడికి చేరుకుందామని అక్షయ్‌కి సలహా ఇచ్చారు సినిమా డైరెక్టర్.
ఎవరూ గుర్తుపట్టలేదు..
డైరెక్టర్ సూచన మేరకు మెట్రోలో ప్రయాణించారు అక్షయ్ కుమార్. ఇద్దరు బాడీగార్డులతోపాటు మెట్రో ఎక్కిన అక్షయ్ ఓ సీటు దొరకడంతో అక్కడ కూర్చున్నాడు. కాగా, క్లీన్ షేవ్‌తో అక్షయ్ కుమార్‌ను ప్రయాణికులు గుర్తుపట్టకపోవడం గమనార్హం. వర్షం పడుతుండగా మెట్రోలో ప్రయాణించిన అక్షయ్ సరదాగా గడిపారు.
|
రెండు గంటల ప్రయాణం 20నిమిషాల్లో..
అంతేగాక, మెట్రోలో ప్రయాణిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో అభిమానుల కోసం పోస్టు చేశారు. రెండు గంటలపాటు జరిగే తమ ప్రయాణాన్ని ఈ మెట్రో 20 నిమిషాలకు తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో అక్కీని కొనియాడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
|
థ్యాంక్యూ అంటూ ముంబై మెట్రో..
కాగా, భారీ ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణించడంపై ముంబై మెట్రో కూడా స్పందించింది. ట్రావెల్ లైక్ బాస్ అంటూ ట్వీట్ చేసింది. మెట్రోలో ప్రయాణించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపింది.
అక్షయ్ చేతిలో అరడజను సినిమాలు..
అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్' ఇటీవల విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన హౌస్‌ఫుల్ 4 త్వరలో విడుదల కానుంది. గుడ్‌న్యూస్ తోపాటు సూర్యవంశి, లక్ష్మీబాంబ్, పథ్వీరాజ్ లాంటి అరడజను సినిమాలు అక్షయ్ చేతిలో ఉన్నాయి.