ఓటీటీలో మరో పెద్ద సినిమాను విడుదల చేస్తున్న స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మరో సినిమా కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది దీపావళికి అక్షయ్ లక్ష్మీ బాంబ్ సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ టాక్ రాలేదు. ఇక మరో సినిమా నిర్మాతలు అక్షయ్ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ విడుదల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నారు.
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రంజిత్ తివారి డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఆమెజాన్ సంస్థతో చర్చలు కార్యరూపం దాల్చినట్లయితే, ఈ చిత్రం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుందట. బెల్ బాటమ్ నిర్మాతలు జాకీ భగ్నాని, వాషు భగ్నాని అమెజాన్ ఇచ్చిన ఆఫర్ కు కాస్త టెంప్ట్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ఆఫర్ లో ఖరీదు ఇంకాస్త పెరిగితే బావుంటుందని అనుకుంటున్నారట. ఈ డీలింగ్ పై వచ్చే నెలలో కొంత స్పష్టత ఉండవచ్చని సమాచారం. అసలైతే ఈ చిత్రం ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ అది ఇప్పుడు జరగనట్లు కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ డిజిటల్ రిలీజ్ కు పెద్దగా అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











